Home

అలియా.. రెస్ట్ లేదు షూటింగ్‌లతో బిజీ బిజీ

Home > సినిమా

బాలీవుడ్‌ ప్రేమ జంట అలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ ఏప్రిల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
#Insta/Alia Bhatt
Home > సినిమా

తాను తల్లినికాబోతున్నట్లు అలియా ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
#Insta/Alia Bhatt
Home > సినిమా

గర్భవతిగా ఉండి కూడా సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
#Insta/Alia Bhatt
Home > సినిమా

‘డార్లింగ్స్‌’ చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ సినిమాలో షెపాలీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు.
#Insta/Alia Bhatt
Home > సినిమా

‘డ్లార్లింగ్స్‌’ను గౌరీఖాన్‌, గౌరవ్‌ వర్మతో కలిసి అలియా స్వయంగా నిర్మించడం విశేషం. ఇది ఆగస్టు 5న నెట్‌ప్లిక్స్‌లో విడుదల కానుంది.
#Insta/Alia Bhatt
Home > సినిమా

బాలీవుడ్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మస్త్ర’లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా జంట వెండితెరపై సందడి చేయనుంది.
#Insta/Alia Bhatt
Home > సినిమా

ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ‘బ్రహ్మస్త్ర.. మొదటి భాగం: శివ’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
#Insta/Alia Bhatt
Home > సినిమా

కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్ కహానీ’లో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ నాయకా నాయికలు.
#Insta/Alia Bhatt
Home > సినిమా

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా 2023 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Insta/Alia Bhatt
Home > సినిమా

‘హర్ట్ ఆఫ్‌ స్టోన్‌’ అనే అమెరికన్‌ స్పై చిత్రంలోనూ అలియా కనిపించనుంది. ఈ చిత్రం నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది.
#Insta/Alia Bhatt
Home > సినిమా

ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జి లే జరా’ అనే సినిమాలో ప్రియంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి అలియా సందడి చేయనుంది.
#Insta/Alia Bhatt