Home

గేమర్స్‌ కోసం అదిరిపోయే ఆసుస్‌ ఫోన్లు వచ్చేశాయ్‌!

Home > టెక్నాలజీ

గేమర్స్‌ కోసం ఆసుస్‌ రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో లాంఛ్‌ చేసింది. ఎంతో హిట్ అయిన రోగ్ 5 సిరీస్‌కు కొనసాగింపుగా వీటిని తీసుకొచ్చింది.
#Asus
Home > టెక్నాలజీ

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6, ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6 ప్రో అనే రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.
#Asus
Home > టెక్నాలజీ

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రోగ్‌ ఫోన్‌ 6లో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది. దీని ధర రూ.71,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ ఫాంటమ్‌ బ్లాక్‌, స్ట్రామ్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.
#Asus
Home > టెక్నాలజీ

ఆసుస్‌ ఫోన్‌ 6 ప్రోలో.. 18జీబీ ర్యామ్‌+ 512జీబీ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది. దీని ధరను 89,999గా కంపెనీ నిర్ణయించింది. ఆసుస్‌ ఫోన్‌ 6 ప్రో.. కేవలం స్ట్రామ్‌ వైట్ రంగులోనే విడుదల చేసింది.
#Asus
Home > టెక్నాలజీ

రెండూ 6,000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న మొబైళ్లే. 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తాయి. డెలివరీ బాక్స్‌లో మాత్రం 30 వాట్‌ ఛార్జర్‌నే ఆసుస్ ఇస్తోంది.
#Asus
Home > టెక్నాలజీ

ఈ రెండు ఫోన్లు క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్‌ 8+ జెన్‌1 ప్రాసెసర్‌ మీద పని చేస్తాయి. ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ను కలిగి ఉన్నాయి. స్క్రీన్‌ రిజల్యూయన్‌ రెండింటిలోనూ 1080*2448గా ఉంది. గేమ్‌ కూల్ 6 కూలింగ్ సిస్టమ్ రెండు ఫోన్లలోనూ ఉంటుంది.
#Asus
Home > టెక్నాలజీ

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6,ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6ప్రో ఫోన్లకు వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
#Asus
Home > టెక్నాలజీ

165 హెర్జ్‌ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, రోగ్ ట్యూనింగ్ టెక్నాలజీతో కూడిన 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో ఈ రెండు మొబైళ్లు వస్తున్నాయి.
#Asus
Home > టెక్నాలజీ

గేమ్‌ కంట్రోలర్స్‌లా ఉపయోగించుకునేందుకు ఎయిర్ ట్రిగర్ అల్ట్రా సోనిక్ బటన్స్ ఈ ఫోన్‌లకు ఉంటాయి. సూపర్ లైనీర్ డ్యుయల్ ఫేసింగ్ స్పీకర్లున్నాయి.
#Asus
Home > టెక్నాలజీ

ఇక రోగ్ ఫోన్‌ 6కు, రోగ్ 6 ప్రో మోడల్‌కు ప్రధాన తేడా బ్యాక్‌ ప్యానెల్. రోగ్ ఫోన్‌ 6 ప్రో మోడల్ బ్యాక్ ప్యానెల్‌కు PMOLEDడిస్‌ప్లే ఉంటుంది. ప్రో కాని మోడల్‌కు రోగ్ లోగో ఉంటుంది.
#Asus
Home > టెక్నాలజీ

అయితే ఈ మొబైళ్ల విక్రయం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని అతి త్వరలో ప్రకటించనున్నట్టు ఆసుస్ వెల్లడించింది.
#Asus