Home

భోజనం చేసిన తర్వాత ఈ పనులు అస్సలు చేయొద్దు!

Home > ఆరోగ్యం

భోజనం తినగానే కొంతమంది కునుకు తీయడానికి ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినటం, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే భోజనం చేశాక అరగంట లేదా గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించమంటున్నారు.
#pixabay
Home > ఆరోగ్యం

కొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సరైన మొత్తంలో రక్తప్రసరణ జరగదు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
#twitter
Home > ఆరోగ్యం

భోజనం చేసిన వెంటనే టీ/కాఫీలు తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్‌ వంటివి గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదట!
#instagram
Home > ఆరోగ్యం

తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగితే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్‌, జీర్ణ రసాలు.. తక్కువగా విడుదలై ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
#twitter
Home > ఆరోగ్యం

భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
#instagram
Home > ఆరోగ్యం

భోజనం చేయగానే ఫ్రూట్స్‌ తినడం వల్ల అవి ఇతర పదార్థాలతో కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవు. కాబట్టి పండ్లను అల్పాహార సమయంలో తినడం బెటర్‌.
#eenadu
Home > ఆరోగ్యం

భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే ఆహారం తీసుకున్న తర్వాత వర్కౌట్స్‌ చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలిగి కడుపులో అసౌకర్యం, కడుపునొప్పి.. వంటి సమస్యలొస్తాయి.
#eenadu