Home

గ్రీన్‌ టీతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Home > ఆరోగ్యం

బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునే వారు తరచూ గ్రీన్‌ టీ తాగడం వల్ల ఫలితం ఉంటుంది. గ్రీన్‌ టీ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తద్వారా బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

మృదువైన చర్మానికి

గ్రీన్‌టీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. చర్మానికి తేమను అందిస్తూ మృదువుగా, యవ్వనంగా కనిపించేలా, ముడతలు పడకుండా చూస్తుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

క్యాన్సర్‌ బారిన పడకుండా

గ్రీన్‌ టీలో ఉండే పాలీఫినాల్స్‌.. క్యాన్సర్‌ కణాలను చంపి, విస్తరించకుండా ఆపడంలో ప్రధానపాత్ర పోషిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.
#Pixabay
Home > ఆరోగ్యం

గుండె జబ్బులు రాకుండా

ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల్ని నిరోధించగలవు. చెడు కొవ్వు పెరగకుండా అడ్డుకోవడంతోపాటు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
#Pixabay
Home > ఆరోగ్యం

మెదడు చురుగ్గా..

గ్రీన్ టీలో ఎల్ థియానైన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడు చురుకుగా పనిచేయడానికి దోహద పడుతుంది. అంతేకాదు, మెదడుకు సంబంధించిన అల్జిమర్స్‌, పార్కిన్సన్‌ తదితర వ్యాధులు రాకుండా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
#Pixabay
Home > ఆరోగ్యం

ప్రశాంతత

గ్రీన్‌ టీ తాగితే ఆందోళన తగ్గిపోయి, ప్రశాంతత చేకూరుతుంది. ఇందులో ఉండే థియానైన్‌ మెదడులో అల్ఫా తరంగాల ఉత్పత్తిని ప్రేరేపించి ప్రశాంత స్థితి కలిగేలా చేస్తుంది. ధ్యానం మాదిరిగా మానసిక చురుకుదనాన్నీ కలిగిస్తుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

రోగనిరోధక శక్తి

గ్రీన్‌టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

ఎముకల ఆరోగ్యం

శరీరంలో ఆర్థరైటిస్ నొప్పికి కారణమయ్యే కొన్ని అణువుల ఉత్పత్తిని గ్రీన్‌ టీ తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

ఆయుర్వృద్ధి

గ్రీన్‌ టీ తాగడం వల్ల మనిషి జీవితకాలం కూడా పెరుగుతుందని జపాన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది.
#Pixabay