Home

బ్రౌజింగ్‌కి క్రోమ్‌ ఒక్కటేనా.. ఇంకా చాలా ఉన్నాయి!

Home > టెక్నాలజీ

ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారం కావాలంటే బ్రౌజర్‌ అవసరం. నెట్టింట్లో అనేక బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన బ్రౌజర్లు ఏమున్నాయి? వాటి ఫీచర్లేంటో చూద్దాం..
#Pixabay
Home > టెక్నాలజీ

గూగుల్ క్రోమ్‌

ప్రపంచవ్యాప్తంగా సగం మందికిపైగా ఇంటర్నెట్‌ యూజర్లు తమ డెస్క్‌టాప్, మొబైల్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ బ్రౌజర్‌లోని సింక్‌ ఫీచర్ ఎలాంటి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌కైనా సపోర్ట్ చేస్తుంది. కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్స్‌ ఏవైనా మిగతా బ్రౌజర్స్ కంటే ముందుగా గూగుల్ క్రోమ్‌లోకే వస్తాయి.
#Google playstore
Home > టెక్నాలజీ

డక్‌ డక్‌ గో

ఈ బ్రౌజర్‌.. యూజర్‌ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో ఒక్కసారి మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తే మీ ట్యాబ్స్‌ అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేస్తుంది. కుకీస్‌ని ఆటోమేటిగ్గా తొలగిస్తుంది. ట్రాకింగ్ స్క్రిప్ట్‌ని కూడా డిఫాల్ట్‌గా బ్లాక్ చేస్తుంది. డక్‌ డక్‌ గోతో మెయిల్‌ని లింక్‌ చేస్తే.. స్కాన్ చేసి వైరస్, మాల్‌వేర్‌, స్పామ్‌ మెసేజ్‌లను డిలీట్ చేస్తుంది.
#Google playstore
Home > టెక్నాలజీ

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌

ఇందులో గీకో వ్యూ పేరుతో బ్రౌజర్ ఇంజిన్‌ ఇస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్, లైనెక్స్, మ్యాక్ఓఎస్‌, విండోస్‌లను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ బ్రౌజర్‌లలో ఫైర్‌ఫాక్స్ ఎంతో సురక్షితమైంది. ఇంకా ఇందులో బిల్ట్‌-ఇన్‌ పాస్‌వర్డ్ మేనేజర్ కూడా ఉంది. ఇది యూజర్‌ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుతుంది.
#Google playstore
Home > టెక్నాలజీ

వివాల్డి

డెస్క్‌టాప్ వెబ్‌ బ్రౌజర్‌లో ఉండే ముఖ్యమైన కీ ఫీచర్స్ ఈ యాప్‌ కింది భాగం ప్యానల్‌లో ఉంటాయి. క్రోమ్ తరహాలోనే డెస్క్‌టాప్, మొబైల్ యాప్ బ్రౌజర్‌ని సింక్‌ చేసుకోవచ్చు. అలానే బిల్ట్‌-ఇన్‌ నోట్స్, ఫుల్‌ వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్స్‌, వేర్వేరు సెర్చ్‌ ఇంజిన్‌ల మధ్య ఫాస్ట్ ట్రాన్సిషన్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.
#Google playstore
Home > టెక్నాలజీ

బ్రేవ్

బ్రౌజింగ్ యాప్‌లలో బ్రేవ్ వేగవంతమైన, సురక్షితమైన బ్రౌజర్‌. ఇందులో బిల్ట్‌-ఇన్ యాడ్ బ్లాకర్, వెబ్‌సైట్ స్పెసిఫిక్ సెట్టింగ్స్‌ అనే ఫీచర్స్ ఉన్నాయి. అన్ని రకాల డొమైన్‌లలో థర్డ్‌ పార్టీ కుకీస్, హెచ్‌టీటీపీఎస్‌లను కూడా బ్లాక్ చేస్తుంది. ఇందులో క్రిప్టోకరెన్సీ వాలెట్ ఆప్షన్ కూడా ఉంది.
#Google playstore
Home > టెక్నాలజీ

బ్లిస్క్‌

నెట్టింట్లో వెబ్‌ పేజీల్ని ఎక్కువగా ఫోన్‌, సిస్టంలో చూస్తుంటాం. వీటికి తగ్గట్టుగా డెవలపర్లు అప్లికేషన్స్‌ని సులభంగా రూపొందించేందుకు బ్లిస్క్‌ సరైన వేదిక. దీంట్లో వెబ్‌ అప్లికేషన్స్‌ని ఇట్టే చెక్‌ చేయొచ్చు. వెబ్‌ పేజీల కోడింగ్‌ని విశ్లేషించేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌, ‘సైడ్‌-బై-సైడ్‌ వ్యూ’తో ఫోన్‌, పీసీలో వెబ్‌ పేజీలు ఎలా కనిపిస్తాయో చూడొచ్చు.
#Facebook
Home > టెక్నాలజీ

ఒపెరా

ఈ బ్రౌజర్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. సింక్రనైజింగ్ డేటా, బ్లాకింగ్ యాడ్స్, కంప్రెసింగ్ వీడియోస్ వంటి ఆసక్తికర ఫీచర్లున్నాయి. ఒపెరా మినీ బ్రౌజర్‌లోని హైక్వాలిటీ డిజైన్, ఈజీ టు యూజ్ ఇంటర్‌ఫేస్‌లు స్మూత్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.
#Google playstore
Home > టెక్నాలజీ

మిన్‌

ఇందులో ఎన్ని ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసినా వాటి అమరికని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఓపెన్‌ చేసిన ట్యాబ్స్‌లో చూడని వాటిని ‘ఫేడ్‌ అవుట్‌’ చేసి చూపిస్తుంది. ‘ఫోకస్‌ మోడ్‌’తో ఓపెన్‌ చేసి ఉంచిన ట్యాబ్స్‌ను మాయం చేయొచ్చు. ట్యాబ్స్‌ను గ్రూపులుగా విభజించుకోవచ్చు. ప్లేస్టోర్‌లో ఇది లభించదు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
#Twitter
Home > టెక్నాలజీ

ఘోస్ట్‌

ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను ఇందులో సురక్షితంగా మేనేజ్‌ చేసుకోవచ్చు. బ్రౌజింగ్‌ సెషన్స్‌కి పలు రకాల రంగుల్ని ఇవ్వొచ్చు. ట్యాబ్స్‌ను గ్రూపులుగా విభజించుకోవచ్చు. క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్లను దీనికి జత చేసుకొని వాడుకోవచ్చు.
#Ghost