Home

క‌ల్తీని ఇలా క‌నిపెట్టండి..!

Home > లైఫ్‌స్టైల్‌

బఠాణీ

గాజు గ్లాస్‌లో సగం నీరు నింపి అందులో బఠాణీలు వేసి అరగంట ఉంచండి. ఈలోపు నీరు ఆకుపచ్చరంగులోకి మారితే.. కృత్రిమ రంగును వాడినట్లు అర్థం. రంగుమారకుండా ఉంటే.. అవి స్వచ్ఛమైనవి.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

తేయాకు

రెండు ఫిల్టర్‌ పేపర్లు తీసుకొని వాటిపై తేయాకు వేసి కాసిన్ని నీళ్లు చల్లండి. ఆ తరువాత ట్యాప్‌ వాటర్‌ కింద ఫిల్టర్‌ పేపర్‌ని వాష్‌ చేయండి. తేయాకు కనుక కల్తీ అయితే.. ఫిల్టర్‌ పేపర్‌పై చిక్కటి బ్రౌన్‌ మరకలు ఉంటాయి. స్వచ్ఛమైనదైతే ఫిల్టర్‌పేపర్‌పై అసలు మరకలు పడవు.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

మిరియాలు

మిరియాల్లో స్వచ్ఛతను కనిపెట్టడం చాలా తేలిక. మిరియాలను ఓ టేబుల్‌ పైపోసి వాటిని బొటన వేలితో గట్టిగా నొక్కండి. కల్తీ మిరియాలైతే.. వెంటనే చితికిపోతాయి. స్వచ్ఛమైనవి గట్టిగా ఉంటాయి.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

కారం

ముందుగా ఓ గ్లాస్‌ నీటిలో టీ స్పూన్‌ కారం వెయ్యండి. ఆ మిశ్రమాన్ని కొద్దిగా చేతిపై తీసుకొని రుద్దండి. అది గట్టిగా ఉంటే ఇటుక పొడి కలిసిందని అర్థం. మెత్తగా ఉందంటే అందులో సోప్‌ స్టోన్‌ ఉందని అర్థం. ఈ రెండు పదార్థాలతో శరీరానికి ప్రమాదమే.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

పసుపు

రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్‌ స్పూన్‌ పసుపు వేయండి. స్వచ్ఛమైనది అయితే లేత పసుపు రంగులోకి మారి నీటి అడుగుకు చేరుతుంది. కల్తీది గ్లాసులోని నీటిని చిక్కటి పసుపు రంగులోకి మార్చేస్తుంది.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

పాలు

ఒక చుక్క పాలను నేలపై వేయండి. అవి నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు అయితే.. భూమిలోకి త్వరగా ఇంకవు. నీళ్లు కలిపిన పాలు అయితే.. వెంటనే భూమిలోకి ఇంకిపోతాయి.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

కొబ్బరి నూనె

కొంచె కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిజ్‌లో అరగంట ఉంచి తీసి చూడాలి. స్వచ్ఛమైన కొబ్బరినూనె గడ్డకడుతుంది. కల్తీ జరిగితే గడ్డ కట్టదు.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

చక్కెర

కొంచెం చక్కెరను నీటిలో వేసి స్పూన్‌తో వేగంగా తిప్పాలి. చక్కెర కల్తీ ఉంటే నురగలు వస్తాయి.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

తేనె

తేనె వేస్తే అంటుకోకుండా జారిపోతే అది అసలు తేనె. అంటుకుంటే అది కల్తీ జరిగినట్టే. తేనెలో ముంచిన అగ్గిపుల్లను వెలిగిస్తే వెంటనే మండితే అది అసలు తేనె. కల్తీది అయితే ఆ పుల్ల వెలగదు.
#Unsplash
Home > లైఫ్‌స్టైల్‌

ఉప్పు

ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడిపైకి తేలిపోతుంది.బంగాళదుంప ముక్కపై అయొడైజ్డ్‌ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం కలిపి వేచిచూడాలి. ఆ దుంపపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్టు లెక్క.
#Unsplash