Home

బ్రేకప్‌ నుంచి తేరుకోవట్లేదా? ఇలా చేయండి..

Home > లైఫ్‌స్టైల్‌

బ్రేకప్‌ అయినా.. తన మాజీ ప్రేమికుడు/ప్రేమికురాలి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. వారిని మర్చిపోలేక మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ప్రేమించిన వ్యక్తిని, వారి జ్ఞాపకాల్ని మర్చిపోవచ్చు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కొంత కష్టమైన పనే. అయినా ఆ ప్రేమ చాప్టర్‌ క్లోజ్‌ అయిపోయిందన్న నిజాన్ని గుర్తించాలి. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

కొంతమంది బ్రేకప్‌ చెప్పిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని భావిస్తారు. తరచూ కాల్స్‌, మెసెజ్‌లు చేసుకుంటారు. దీని వల్ల మీరు ఆ బ్రేకప్‌ బాధలో నుంచి బయటపడే అవకాశమే లేకుండా పోతుంది. విడిపోయిన తర్వాత వారితో టచ్‌లో ఉండకపోవడమే ఉత్తమం.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రేమలో ఉన్నప్పుడు కలిసి తిరిగిన ప్రాంతాలని చూసినప్పుడు మళ్లీ గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అందుకే, కొన్నాళ్ల పాటు అలాంటి చోట్లకు వెళ్లకూడదు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రేమించిన వ్యక్తి ఇచ్చిన బహుమతులు, ఇతర వస్తువులు ఏమైనా ఇంట్లోనే ఉంటే వెంటనే వాటిని తీసేయాలి. లేదంటే వాటిని చూసిన ప్రతిసారి మీ ప్రేయసి/ప్రియుడు గుర్తుకు వచ్చే అవకాశముంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

సోషల్‌మీడియాలో ‘మాజీ’ని ఫాలో అవడం ఆపేయండి లేదా బ్లాక్‌ చేయండి. మీ మొబైల్‌లో కాంటాక్ట్‌ కూడా డిలిట్‌ చేయండి. అలా చేయకుండా తరచూ వారి ప్రొఫైల్‌ ఫొటో, స్టేటస్‌, పోస్టులు చూస్తూ ఉంటే మళ్లీ మీకు గతం, బ్రేకప్‌ గుర్తొచ్చి బాధపడతారు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రతీకార ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ప్రేమించి మోసం చేశారనో.. పెళ్లి నిరాకరించారనో ప్రేమించిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే.. మీ కెరీర్‌ నాశనమవుతుంది. ఇలాంటి ఆలోచనలను దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

బ్రేకప్‌ అయ్యాక బాధ ఉండటం సహజమే. మీ స్నేహితులకు, కుటుంబసభ్యులతో మీ బాధను పంచుకోండి. వారిని హత్తుకొని ఏడ్చేయండి. ఏడుపు వల్ల మనసులో భారం తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

విషాద గీతాలు/రొమాంటిక్‌ పాటలు వినడం కొన్ని రోజులు ఆపేయండి. బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పాటలోని సాహిత్యానికి అర్థం బోధపడుతుంది. రొమాంటిక్‌ పాటలు గతాన్ని, విషాద గీతాలు మీ ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. దీంతో బ్రేకప్‌ బాధ రెట్టింపవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఖాళీగా/ఒంటరిగా కూర్చుంటే ప్రేమ వైఫల్యం గురించే ఆలోచనలు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు కొత్తగా వ్యాపకాలు అలవాటు చేసుకోవడం మంచిది. దీని వల్ల మీ ఆలోచనలు వ్యాపకంపై మళ్లుతాయి. చెడు వ్యాపకాలు అలవాట్లు చేసుకోవద్దు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

గతం గతః అనుకొని కెరీర్‌పై దృష్టి సారించాలి. ఒక కొత్త జీవితానికి నాంది పలకాలి. ఇప్పటి వరకు ఏం సాధించాం..? భవిష్యత్తులో ఇంకేం చేయాలి? అనే విషయాల గురించి ఆలోచించాలి.
#Pixabay