2015లో ‘కేటుగాడు’ చిత్రంతో హీరోయిన్గా మారింది చాందినీ. కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జ్, బొంబాట్ వంటి పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు.
సినిమాలే కాదు.. వెబ్సీరిస్ల్లోనూ నటిస్తోంది చాందినీ. ఇప్పటి వరకు గాడ్స్ ఆఫ్ ధర్మపురి, మస్తీస్, అన్హియర్డ్, గాలివాన తదితర సీరిస్ల్లో నటించి మెప్పించింది.
చాందినీ చిన్నప్పుడు త్రో బాల్ ఛాంపియన్. కథలు కూడా రాసేదట. దీంతో పెద్దాయక రైటర్ అవ్వాలనుకుంది. ఇప్పుడు నటిగా స్థిరపడి ఆ తర్వాత దర్శకత్వం చేయాలని ఫిక్సయిందట.