Home

గన్‌ పట్టిన అందాల రాక్షసి.. లావణ్య త్రిపాఠి

Home > సినిమా

‘అందాల రాక్షసి’తో టాలీవుడ్‌కి పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ బర్త్‌డే’ జులై 8న విడుదల కానుంది. ఇందులో తన కామెడీ రోల్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేశానని చెప్పింది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

లావణ్య త్రిపాఠి 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. పెరిగింది మాత్రం ఉత్తరాఖండ్‌లో.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

ఉన్నత చదువుల నిమిత్తం ముంబయి వెళ్లిన లావణ్య.. రిషి దయారామ్‌ నేషనల్‌ కాలేజ్‌లో ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

మోడలింగ్‌పై ఆసక్తి ఏర్పడటంతో అటువైపుగా అడుగులు వేసింది. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో నటించింది. 2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’లో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది. తొలి చిత్రంతోనే యువతలో క్రేజ్‌ సంపాదించింది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

ఆ తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్‌ సురవరం’ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

‘గీత గోవిందం’లో కథానాయికగా చేసే అవకాశం ముందుగా లావణ్య త్రిపాఠినే వరించిందట. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, అందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని లావణ్య ఓ సందర్భంలో తెలిపింది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

లావణ్యకి కోపం ఎక్కువట. ఈ ఒక్కటీ మినహా తనలో మార్చుకునే అంశం మరేదీ లేదని చెప్పుకొచ్చింది.
#Intagram/Lavanya tripathi
Home > సినిమా

తాను నటిని కావడానికి అలనాటి తారలు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లే స్ఫూర్తి అని పలు సందర్భాల్లో వెల్లడించింది లావణ్య.
#Intagram/Lavanya tripathi