Home

‘బ్రహ్మాస్త్ర’ తార.. వలపుల సితార!

Home > సినిమా

సినిమా తారలకున్నంత పాపులారిటీ.. బుల్లితెర నటులకు ఉండదంటారు. కానీ, ఆ సీరియల్స్‌తోనే స్టార్‌డమ్‌ సంపాదించింది.. నటి మౌనీ రాయ్‌.
#Instagram/mouni roy
Home > సినిమా

‘నాగిన్‌’ సీరియల్‌తో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది.
#Instagram/mouni roy
Home > సినిమా

సోషల్‌మీడియాలో ఆమెకు చాలా క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాలో తనని 23.7మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
#Instagram/mouni roy
Home > సినిమా

మౌనీ రాయ్‌.. 1985 సెప్టెంబర్‌ 28న పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో జన్మించింది. ఆమె తల్లి ముక్తి.. థియేటర్‌ ఆర్టిస్ట్‌.
#Instagram/mouni roy
Home > సినిమా

మధుబాల, మాధురీ దీక్షిత్‌ వంటి తారల్ని చూసి తానూ నటినవ్వాలని చిన్నప్పుడే నిర్ణయించుకుందట.
#Instagram/mouni roy
Home > సినిమా

మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసేందుకు దిల్లీకి వెళ్లిన ఈ అమ్మడు.. మధ్యలోనే చదువు ఆపేసి.. సినీ అవకాశాల కోసం ముంబయికి చేరుకుంది.
#Instagram/mouni roy
Home > సినిమా

మోడలింగ్‌లో మౌనీ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2006లో ప్రారంభమైన ‘క్యూంకీ సాస్‌ బీ కభీ బాహు థి’ సీరియల్‌తో తన యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించింది.
Home > సినిమా

ఆ సీరియల్‌లో ఆమెకు ఆదరణ లభించడంతో సీరియల్స్‌లో అవకాశాలు క్యూ కట్టాయి. అలా కస్తూరి, దేవొంకీ దేవ్‌.. మహదేవ్‌ తదితర సీరియల్స్‌లో నటించింది.
#Instagram/mouni roy
Home > సినిమా

నాగిన్‌ సీరియల్‌ మౌనీని దేశవ్యాప్తంగా ఫేమస్‌ చేసింది. ఆ సీరియల్‌ వివిధ భాషల్లో అనువాదం కావడంతో ఆమెకు ఆదరణ పెరిగింది. ఈ సీరియల్‌ను తెలుగులోనూ అనువదించారు.
#Instagram/mouni roy
Home > సినిమా

మౌనీ ప్రధాన పాత్రలో నటించిన నాగిన్‌.. తొలి సీజన్‌ విజయవంతం కావడంతో.. సీరియల్‌ మరో రెండు సీజన్లు వచ్చాయి.
#Instagram/mouni roy
Home > సినిమా

సినిమాల విషయానికొస్తే 2011లో ‘హీరో హిట్లర్‌ ఇన్‌ లవ్‌’ అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది.
#Instagram/mouni roy
Home > సినిమా

తాజాగా నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర ’లో మౌనీ.. కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
#Instagram/mouni roy
Home > సినిమా

మౌనీ రాయ్‌.. మంచి డ్యాన్సర్‌ కూడా. కెరీర్‌ ప్రారంభంలో ‘జర నాచ్‌కే దిఖావ్‌’ డ్యాన్స్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. పలు రియాల్టీ షోల్లోనూ పాల్గొంది.
#Instagram/mouni roy
Home > సినిమా

బిగ్‌బాస్‌లోనూ మెరిసిన ఈ అందాల భామ.. ప్రస్తుతం డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌మాస్టర్‌ 5 రియాల్టీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.
#Instagram/mouni roy
Home > సినిమా

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మౌనీ రాయ్‌.. 2022 జనవరిలో ఆయన్ను పెళ్లి చేసుకుంది. ఆమెకు గోల్డెన్‌ వీసా ఉంది.
#Instagram/mouni roy
Home > సినిమా

పెళ్లయిన తర్వాత కూడా మౌనీ రాయ్‌.. హాట్‌ లుక్స్‌తో ఫొటోషూట్‌లో పాల్గొంటూ.. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తోంది. దీంతో అవిసోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
#Instagram/mouni roy