Home

సీతామహాలక్ష్మి సిత్రాలు.. ఇవిగో ఆమె సంగతులు!

Home > సినిమా

బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించి.. వెండితెరపై హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి మృణాల్‌ ఠాకూర్‌.
#Instagram/mrunal thakur
Home > సినిమా

ఇటీవల హిందీ ‘జెర్సీ’తో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా మృణాల్‌ నటించింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

1991 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధూలెలో జన్మించిన ఆమె.. మాస్‌ మీడియాలో డిగ్రీ చేసింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

చదువుకుంటున్న రోజుల్లోనే టీవీ సీరియల్‌లో అవకాశం రావడంతో 2012-13లో ప్రసారమైన ‘ముఝ్‌సే కుచ్‌ కెహతీ యా ఖామూషియాన్‌’ సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

2014లో రెండు మరాఠీ చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత సీరియల్స్‌తోనే బిజీగా మారిపోయింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

2018లో తొలిసారి ‘లవ్‌ సోనియా’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. ‘సూపర్‌ 30’తో సూపర్‌ హిట్‌ కొట్టింది. పలు వీడియో ఆల్బమ్స్‌లోనూ మెరిసింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

ఆ తర్వాత బట్లా హౌజ్‌, ఘోస్ట్‌ స్టోరీస్‌, తుపాన్‌, ధమాకా, జెర్సీ, సీతారామం చిత్రాల్లో నటించింది. మరో మూడు ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
#Instagram/mrunal thakur
Home > సినిమా

టీనేజీలోనే మృణాల్‌ మానసిక కుంగుబాటుకు గురయిందట. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తనను వెంటాడేవని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

కొన్నాళ్ల కిందట.. తనకు లవ్‌ బ్రేకప్‌ అయిందట. తన ప్రియుడు సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తాను సినిమాల్లో నటిస్తానని తెలిసి పారిపోయాడని చెప్పింది.
#Instagram/mrunal thakur
Home > సినిమా

సోషల్‌మీడియాలో మృణాల్‌ బాడీషేమింగ్‌కు కూడా గురయింది. తన శరీరాకృతి గురించి నెటిజన్లు కామెంట్లు చేసినప్పుడు చాలా బాధపడిందట.
#Instagram/mrunal thakur
Home > సినిమా

ఓ సారి అమెరికాకి వెళ్లినప్పుడు తనను ‘ఇండియన్‌ కర్దాషియన్‌’ అని పిలిచారట. ఆ శరీరాకృతి కోసం అక్కడి వాళ్లు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారట. అది తెలిశాక బాడీషేమింగ్‌ను పట్టించుకోలేదని గర్వంగా చెబుతోందీ భామ.
#Instagram/mrunal thakur
Home > సినిమా

బాడీషేమింగ్ చేసే ట్రోలర్స్‌ను చూసి మహిళలు భయపడొద్దని, ఎవరు ఎలా ఉన్నా.. వారంతా ప్రత్యేకమేనని అంటోంది.
#Instagram/mrunal thakur