Home

అందం + ప్రతిభ వెరసి.. తాప్సీ!

Home > సినిమా

తాప్సీ పన్ను.. దక్షిణాదిన తెరంగేట్రం చేసి.. బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న బ్యూటిఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌.
#Instagram/taapee
Home > సినిమా

భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా మరో బంఫర్‌ ఆఫర్‌ కొట్టేసింది.
#Instagram/taapee
Home > సినిమా

షారుక్‌ ఖాన్‌ - రాజ్‌కుమార్‌ హిరాణీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డంకి’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
#Instagram/taapee
Home > సినిమా

ఈ అవకాశం తనకు సిఫార్సులతో రాలేదని, తన ప్రతిభను చూసే వచ్చిందని చెబుతోంది. షారుఖ్‌తో నటించే అవకాశం రావడాన్ని వరంగా భావిస్తోంది.
#Instagram/taapee
Home > సినిమా

1987 ఆగస్టు 1న దిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన తాప్సీ.. అక్కడే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదివింది.
#Instagram/taapee
Home > సినిమా

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. 2008లో ‘గెట్‌ గార్జియస్‌’ అనే టాలెంట్‌ షోలో తాప్సీ ఎంపికైంది. దీంతో మోడలింగ్‌ వైపు వెళ్లింది.
#Instagram/taapee
Home > సినిమా

2008లో పాంటలూన్‌ ఫెమినా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌, సఫీ ఫెమినా మిస్‌ బ్యూటిఫుల్‌ స్కిన్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. పలు బ్రాండ్స్‌ కోసం టీవీ యాడ్స్‌లో నటించింది.
#Instagram/taapee
Home > సినిమా

2010లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఝుమ్మంది నాదం’ తో చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ అవకాశాలు క్యూ కట్టాయి.
#Instagram/taapee
Home > సినిమా

2011లో ప్రభాస్‌ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో తాప్సీ పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.
#Instagram/taapee
Home > సినిమా

తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లోనూ నటించిన తాప్సీ.. 2013లో ‘చష్మే బద్దూర్‌’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.
#Instagram/taapee
Home > సినిమా

‘పింక్‌’ చిత్రంతో ఆమెకు బీటౌన్‌లో పాపులారిటీ పెరిగింది. ఓ వైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతోంది.
#Instagram/taapee
Home > సినిమా

‘శాండ్‌ కి ఆంఖ్‌’లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌), ‘థప్పడ్‌’లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకుంది తాప్సీ. ఇవే కాకుండా తన నటనకు ఎన్నో అవార్డులు దక్కాయి.
#Instagram/taapee
Home > సినిమా

మొదట్లో తను మరింత అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కానీ, మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థం చేసుకొని ఆ ప్రయత్నాలు విరమించిందట.
#Instagram/taapee
Home > సినిమా

ఈ ముద్దుగుమ్మ నటిగానే కాదు.. నిర్మాతగానూ మారింది. స్నేహితులతో కలిసి ‘ఔట్‌సైడర్‌ ఫిల్మ్‌’ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే, తన సోదరితో కలిసి ‘ది వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’అనే ఈవెంట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీని నడిపిస్తోంది.
#Instagram/taapee
Home > సినిమా

తాప్సీ చేతిలో ప్రస్తుతం అరడజనుకుపైగా ప్రాజెక్టులున్నాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ.. తన పంథాలోనే ముందుకు సాగుతోంది.
#Instagram/taapee