Home

విదేశాల్లో సందడి చేస్తోన్న జాన్వీ కపూర్‌

Home > సినిమా

అనతికాలంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి జాన్వీకపూర్‌.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

శ్రీదేవి-బోనీ కపూర్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

ప్రస్తుతం ఈ రూహీ భామ.. విదేశాల్లో సందడి చేస్తోంది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

జాన్వీ నటిస్తోన్న ‘బవాల్‌’ యూరప్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం అక్కడ పర్యటిస్తోంది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

గత నెలలో ఫ్రాన్స్‌కు వెళ్లిన ఈ ధడక్‌ బ్యూటీ.. అక్కడి పర్యటక ప్రాంతాల్ని సందర్శించింది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

ఈఫిల్‌ టవర్‌ వద్ద ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. అందమైన బొమ్మలా ఉన్నావంటూ నెటిజన్లు, ఆమె సన్నిహితులు కామెంట్లు పెట్టారు.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

ఫ్రాన్స్‌ నుంచి జర్మనీకి చేరుకున్న జాన్వీ.. బెర్లిన్‌ నగర వీధుల్లో చక్కర్లు కొట్టింది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

ఇటీవల నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న అమ్మడు.. ఖాళీ సమయంలో టూర్‌ను ఎంజాయ్‌ చేసింది.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

రెండ్రోజుల కిందట ఆమ్‌స్టర్‌డామ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇదే విషయాన్ని జాన్వీ ఇన్‌స్టాలో వెల్లడించింది. తరువాత పోలాండ్‌లో చిత్రీకరణ ఉంటుందట.
#Instagram/Janhvi Kapoor
Home > సినిమా

ఇటీవల జాన్వీ నటించిన ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. ప్రస్తుతం ఆమె ‘బవాల్‌’తోపాటు మిలి, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ చిత్రాల్లో నటిస్తోంది.
#Instagram/Janhvi Kapoor