Home

క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి

Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డుల్లో రివార్డ్‌ పాయింట్స్‌, క్యాష్‌బ్యాక్‌, ట్రావెల్‌, స్టూడెంట్‌, కో-బ్రాండెడ్‌ ఇలా అనేక రకాల కార్డులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ అవసరాలకు తగిన కార్డును ఎంచుకోవాలి.
#Pixabay
Home > బిజినెస్‌

చాలా క్రెడిట్‌కార్డులు అవి అందించే సేవల్ని బట్టి వార్షిక రుసుములు వసూలు చేస్తుంటాయి. అయితే, కొన్ని బేసిక్‌ క్రెడిట్‌ కార్డులకు వార్షిక రుసుములు ఉండవు. అందుకే, రుసుముల గురించి ఆరా తీయాలి.
#Pixabay
Home > బిజినెస్‌

ఆదాయాన్ని బట్టి క్రెడిట్‌ లిమిట్‌ ఉంటుంది. క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకునే సమయంలో మీ ఆదాయాన్ని తెలియజేస్తే.. వీలైనన్నీ ఎక్కువ క్రెడిట్‌ కార్డు ఆప్షన్లు వస్తాయి. వాటిలో మీకు నచ్చిన, అవసరం మేరకు క్రెడిట్‌ లిమిట్‌ ఉన్న కార్డు తీసుకోవచ్చు.
#Pixabay
Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డులకు వడ్డీ లేకుండా సొమ్ము తిరిగి చెల్లించేందుకు కొంత గ‌డువు ఉంటుంది. ఈ లోపుగా బ‌కాయిలు చెల్లిస్తే ఎలాంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. అయిన‌ప్ప‌టికీ.. గడువు తర్వాత ఎంత వడ్డీ విధిస్తారో ముందే తెలుసుకోవడం మేలు.
#Pixabay
Home > బిజినెస్‌

ప్రారంభ, వార్షిక నిర్వహణ ఛార్జీలు, ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసినప్పుడు, చెల్లింపులు ఆలస్యం అయినపుడు రుసుములు ఎంత వరకు విధిస్తారో అడిగి తెలుసుకోవాలి. వీలైనంత వరకూ తక్కువ ఛార్జీలు ఉన్న కార్డును ఎంచుకోవాలి.
#Pixabay
Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డును తీసుకున్న వెంటనే దానిపై మీ పేరు స్పష్టంగా ఉందో లేదో చూడాలి. నియమ నిబంధనలు చదవాలి. క్రెడిట్ కార్డులు సెల్ఫ్ పిన్ జ‌న‌రేష‌న్‌తో వ‌స్తున్నాయి. కాబట్టి.. యూజరే స్వయంగా పిన్‌ జనరేట్‌ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి.
#Pixabay
Home > బిజినెస్‌

షాపులలో, హోటళ్లలో క్రెడిట్‌ కార్డును వేరే చోటికి తీసుకెళ్లకుండా మన ముందే స్వైప్‌ చేయమని కోరాలి. బ్యాంకు ఖాతాలో ఫోన్ నెంబ‌రు అప్‌డేట్‌గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. అప్పుడే లావాదేవీలు జ‌రిగిన వెంట‌నే దానికి సంబంధించిన నోటిఫికేష‌న్ మీ ఫోన్‌కి వ‌స్తుంది.
#Pixabay
Home > బిజినెస్‌

మీ ఖర్చుల బిల్లులు, క్రెడిట్‌ కార్డుల స్టేట్‌మెంట్లు దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఏవైనా తేడాలు వస్తే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయాలి.
#Pixabay
Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువు లోపు చెల్లించే ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రస్తుత క్రెడిట్‌ బిల్లుతోపాటు.. ఆ తర్వాత బిల్లులపై కూడా అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
#Pixabay
Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డు పోతే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్‌ చేయించుకోవాలి. దీంతో త‌దుప‌రి నగదు లావాదేవీలు జరగకుండా జాగ్రత్తప‌డొచ్చు.
#Pixabay
Home > బిజినెస్‌

క్రెడిట్ కార్డ్.. మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేస్తే అది క్రెడిట్ స్కోరుపై చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది. క్రెడిట్ స్కోరు త‌గ్గ‌కుండా ఉండాలంటే క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో 40శాతం మించ‌కుండా చూసుకోవాలి.
#Pixabay