Home

జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇవి గమనించండి

Home > బిజినెస్‌

జీవిత బీమా అనేది అత్యవసరం. ఇంట్లో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ జీవిత బీమా ఆదుకుంటుంది.
#pixabay
Home > బిజినెస్‌

బీమా చేయించుకున్న వ్యక్తి మరణానంతరం ఆ బీమా డబ్బును ఇన్సూరెన్స్‌ కంపెనీ అతడి కుటుంబసభ్యులకు అందజేస్తుంది.
#pixabay
Home > బిజినెస్‌

బీమా తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిశీలించాలి. అవేంటంటే..
#pixabay
Home > బిజినెస్‌

బీమా పాలసీలను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ పరిశీలించాలి. ఎంత బీమా తీసుకోవాలో తెలియకపోతే ఆన్‌లైన్‌ క్యాలిక్యులేటర్‌, ఎంక్వైరీ ద్వారా తెలుసుకోవచ్చు.
#pixabay
Home > బిజినెస్‌

ఎంపిక చేసుకున్న పాలసీని ఇతర సంస్థల పాలసీతో పోల్చి చూడాలి. ప్రీమియం, ఫీచర్స్‌, బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోవాలి.
#pixabay
Home > బిజినెస్‌

బీమా కంపెనీల క్లెయిమ్‌ రేషియో గమనించాలి. బీమా డబ్బును ఇవ్వగల సామర్థ్యం కంపెనీకి ఉందో లేదో పరిశీలించాలి.
#pixabay
Home > బిజినెస్‌

తీసుకున్న పాలసీ మొత్తాన్ని తర్వాత పెంచుకునేలా యాడ్‌-ఆన్స్‌ ఆప్షన్‌ ఉండే బీమా పాలసీని ఎంచుకోవడం మేలు.
#pixabay
Home > బిజినెస్‌

పాలసీ తీసుకునే సమయంలో మీ వైద్య చరిత్ర సహా అన్ని విషయాలు వెల్లడించాలి. లేకపోతే క్లెయిమ్‌ చేసేటప్పుడు కుటుంబసభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
#pixabay
Home > బిజినెస్‌

బీమా పాలసీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లను కుటుంబసభ్యులకు ఇవ్వాలి. బీమా ఉన్నట్లు తెలియకపోతే క్లెయిమ్‌ ఎలా చేసుకోగలరు?
#pixabay