Home

పూరీ జగన్నాథ్‌తో రెండేసి సినిమాలు.. ఆ హీరోలెవరంటే..?

Home > సినిమా

విజయ్‌ దేవరకొండ

పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ‘లైగర్‌’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే వీరిద్దరూ కలిసి ‘జనగణమన’ పేరుతో మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. పూరీ దర్శకత్వంలో విజయ్‌ ఒక్కడే కాదు.. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు పూరీతో రెండేసి సినిమాలు చేసిన వారే. వారెవరంటే...
#Twitter
Home > సినిమా

రవితేజ

మాస్ మహారాజ్‌ రవితేజ మాత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు హిట్ కాగా.. నేనింతే, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.
#Instagram
Home > సినిమా

నాగార్జున

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘కింగ్‌’ నాగార్జున ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన ‘శివమణి’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం ‘సూపర్‌’.
#Twitter
Home > సినిమా

పవన్‌ కల్యాణ్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. 2000లో విడుదలైన బద్రి, 2012లో వచ్చిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి.
#Eenadu
Home > సినిమా

ఎన్టీఆర్‌

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ఎన్టీఆర్‌, పూరీ కాంబినేషన్‌లో రెండు సినిమాలు తెరకెక్కాయి. 2004లో విడుదలైన ‘ఆంధ్రావాలా’ నిరాశపర్చగా.. 2015లో వచ్చిన‘టెంపర్‌’ సూపర్‌ హిట్‌ అయింది.
#Eenadu
Home > సినిమా

అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌.. పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు ‘దేశముదురు’, ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి విజయాలను అందుకున్నాయి.
#Eenadu
Home > సినిమా

మహేశ్‌బాబు

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. 2006లో విడుదలైన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌ కొట్టగా.. 2012లో వచ్చిన ‘బిజినెస్‌మేన్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది.
#Eenadu
Home > సినిమా

ప్రభాస్‌

బహుబలి సినిమాతో పాన్‌ ఇండియాస్టార్‌గా మారిపోయాడు ప్రభాస్‌. పూరీ జగన్నాథ్‌, ప్రభాస్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. 2008లో ‘బుజ్జిగాడు’ చిత్రం విడుదల కాగా.. 2009లో ‘ఏక్‌నిరంజన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
#Eenadu