Home

విడాకులకు ప్రధాన కారణాలివీ..!

Home > లైఫ్‌స్టైల్‌

అపనమ్మకం

భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే బంధం బలహీనపడుతుంది. దీని వల్ల ఇరువురిలో అనుమానాలు, అభద్రతభావం ఏర్పడతాయి. ఆ రెండూ భార్యాభర్తల సౌఖ్యాన్ని దెబ్బతీసి విడిపోయేలా చేస్తాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రేమ లేకపోవడం

పెళ్లయిన తొలినాళ్లలో దంపతులు ప్రేమాభిమానాలను పరస్పరం చూపించుకుంటారు. కాలక్రమంలో కెరీర్‌, కుటుంబ బాధ్యతల మధ్య ప్రేమను చూపించకపోవచ్చు. లేదా జీవిత భాగస్వామిపై మొదటి నుంచీ ప్రేమ లేకపోవచ్చు. దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి.. విడాకుల వరకు వెళ్లొచ్చు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

గృహహింస

విడాకులకు ఇది ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. మానసికంగా, శారీరకంగా పెట్టే హింస భర్తపై భార్యకి విరక్తిని పెంచుతుంది. గృహహింసను భరించలేక బంధాన్ని తెంపుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తారు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

లైంగిక సామర్థ్యం

భార్యాభర్తల అన్యోన్య జీవితంలో శృంగారం కూడా కీలక పాత్ర వహిస్తుంది. అయితే, ఇరువురిలో ఎవరికైనా లైంగిక కోరికలు, సామర్థ్యం తగ్గితే.. భాగస్వామి అసంతృప్తికి లోనవుతారు. ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ విషయంలో సర్దుబాటు చేసుకోలేక విడిపోయేందుకు సిద్ధమవుతారు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం అనేది ఒక అనైతిక చర్య. కానీ, వ్యామోహం కారణంగా భార్య/భర్త తమ సంసార జీవితంలో మరో వ్యక్తికి చోటిచ్చి తప్పు చేస్తుంటారు. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. విడాకులు కోరుకునే వారిలో ఎక్కువ మంది తమ జీవిత భాగస్వామికి మరో వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపించేవాళ్లే.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఆర్థిక స్వేచ్ఛ

ఇటీవల కాలంలో మహిళలూ ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు. దీంతో ఇంట్లో ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతుంటాయి. వాగ్వాదం పెరిగినప్పుడు తన కాళ్లపై తను నిలబడగలనన్న ధీమాతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

జీవనశైలి

భార్యభర్తల జీవనశైలి వేరుగా ఉన్నప్పుడు, ఒకరి ఇష్టాన్ని మరొకరు కాదన్నప్పుడు గొడవలు రావడం సహజం. అయితే, తమకి నచ్చినట్లు ఉండలేక.. భార్య/భర్త చెప్పినట్లు చేయలేక ఇబ్బందిపడుతుంటారు. అది తారాస్థాయికి చేరినప్పుడు విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

కుటుంబసభ్యులూ కారణం కావొచ్చు..

కేవలం భార్యభర్తల మధ్య మనస్పర్థలే కాదు.. కుటుంబసభ్యుల జోక్యం కూడా దంపతుల విడాకులకు కారణమవుతుంటుంది. వారి ప్రవర్తన, భార్యాభర్తల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం, నచ్చని పనులు చేసి విసుగు పుట్టించడం వంటి వాటి వల్ల కూడా భార్యభర్తలు విడిపోతుంటారట.
#Pixabay