Home

‘మిస్టర్‌ కూల్‌’ బర్త్ డే స్పెషల్‌

Home > క్రీడలు

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీ నేటితో 40 ఏళ్లు పూర్తిచేసుకుని 41వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు నెలకొల్పిన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
#Eenadu
Home > క్రీడలు

మైదానంలో ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండే ధోనీని ముద్దుగా ‘మిస్టర్‌ కూల్‌’ అని పిలుస్తుంటారు.
#Eenadu
Home > క్రీడలు

ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా 3 ఐసీసీ ట్రోఫీలు (ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2007, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2011, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2013) సాధించింది. భారత కెప్టెన్లలో ధోనీకే ఈ ఘనత దక్కింది.
#Eenadu
Home > క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ (332 మ్యాచ్‌లు.. 200 వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20లు)కు సారథ్యం వహించిన ఏకైక ఆటగాడు ధోనీనే.
#Eenadu
Home > క్రీడలు

వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్‌ (123) చేసిన రికార్డు ఈ ఝార్ఖండ్‌ డైనమైట్ పేరిటే ఉంది.
#SocialMedia
Home > క్రీడలు

టెస్టుల్లో అత్యధిక (60) మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఏకైక కెప్టెన్‌ కమ్‌ వికెట్ కీపర్.
#Eenadu
Home > క్రీడలు

వన్డేల్లో వికెట్‌కీపర్‌ కమ్ బ్యాటర్‌గా అత్యధిక స్కోరు 183 నాటౌట్‌. (2005లో శ్రీలంకపై)
#SocialMedia
Home > క్రీడలు

అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (5) అందుకుంది ధోనీయే.
#Eenadu
Home > క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో మిస్టర్‌ కూల్‌ 195 స్టంపింగ్‌లు చేసి తొలి స్థానంలో ఉన్నాడు.
#SocialMedia
Home > క్రీడలు

దూకుడైన ఆటతీరుకు మారుపేరైన ధోనీ వన్డే ఛేదనల్లో 9 సార్లు సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు. 2011 ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌ని విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.
#Eenadu
Home > క్రీడలు

వన్డే ఛేదనల్లో 47 సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ రికార్డుకు దరిదాపుల్లో ఏ ఆటగాడు కూడా లేడు. ధోనీ నాటౌట్‌గా ఉండి టీమ్‌ఇండియా ఓడిపోయింది రెండుసార్లే.
#Eenadu
Home > క్రీడలు

వన్డేల్లో కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా 6641 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు ధోనీయే. మొత్తం 350 మ్యాచ్‌లు ఆడి 200 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాడు.
#Eenadu