Home

మరో సినీ జంట.. చూడముచ్చటంటా!

Home > సినిమా

నటి నయనతార.. డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

గురువారం మహాబలిపురంలో ఏర్పాటు చేసిన వివాహ వేదికలో నయన్‌ మెడలో విఘ్నేశ్‌ మూడు ముళ్లు వేశారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

దంపతులుగా మారిన తర్వాతి రోజే ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

2015లో విఘ్నేశ్‌ తెరకెక్కించిన ‘నేనూ రౌడీనే’ చిత్రంలో నటించింది నయన్‌. అదే సమయంలో ఇరువురు ప్రేమలో పడ్డారని టాక్‌ వచ్చింది.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

అది నిజమే అయినా.. చాలా కాలం పాటు వారి ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

2017 నుంచి తరచూ వీరిద్దరూ కలిసి విహారయాత్రలు చేస్తుండటంతో వీరి ప్రేమాయణం గురించి అందరికీ తెలిసింది.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

నయన్‌లో ఉన్న ఆత్మవిశ్వాసమే తనని కట్టిపడేసిందని విఘ్నేశ్‌ ఓ సందర్భంలో చెప్పారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

విఘ్నేశ్‌ మంచి మనసు, సపోర్టింగ్‌ నేచర్‌ నా మనసును తనకు అంకితం చేసేలా చేసిందని అంటోంది.. నయనతార.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

ఇద్దరి పుట్టిన రోజులు, న్యూ ఇయర్‌, వాలంటైన్స్‌ డే ఇలా ప్రతి సందర్భాన్ని నయన్‌-విఘ్నేశ్‌ విదేశాల్లో వేడుకగా జరుపుకున్నారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

2018లో ఈ జంట.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేశ్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

నయన్‌పై ఉన్న ప్రేమను విఘ్నేశ్‌ తరచూ సోషల్‌మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

వివాహం తర్వాత కూడా.. నయన్‌ తన జీవితంలోకి మేడమ్‌గా వచ్చి.. తనే జీవితంగా.. ఇప్పుడు భార్యగా మారిందని చెబుతూ పోస్టు పెట్టారు. దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
#Instagram/Vignesh Shivan
Home > సినిమా

ఇటీవల విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో మరోసారి ‘కాతువకుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో నటించింది నయన్‌. వీరిద్దరూ కలిసి ‘రౌడీ పిక్చర్స్‌’ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు.
#Instagram/Vignesh Shivan