Home

బోల్డ్‌ బ్యూటీ.. విలక్షణ నటి.. రాధికా ఆప్టే!

Home > సినిమా

బాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న నటీమణుల్లో రాధికా ఆప్టే ఒకరు. తాజాగా ఆమె నటించిన ‘ఫోరెన్సిక్‌’ చిత్రం ఓటీటీ జీ5లో విడుదలవుతోంది.
#instagram
Home > సినిమా

కొన్ని సినిమాల్లో బోల్డ్‌ సన్నివేశాల్లో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చిన ఈ తమిళమ్మాయి.. నటిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
#instagram
Home > సినిమా

1985 సెప్టెంబర్‌ 7న వెల్లూరులో రాధిక జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. పుణెలోని ఓ ఆస్పత్రికి రాధిక తండ్రి చైర్మన్‌గా నియమితులవడంతో అక్కడికి మకాం మార్చారు.
#instagram
Home > సినిమా

ఎకనామిక్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన రాధిక.. కథక్‌లో ఎనిమిదేళ్ల పాటు శిక్షణ తీసుకుంది.
#instagram
Home > సినిమా

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చాలాకాలం పనిచేసింది. అప్పుడే ఆమె సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుందట.
#instagram
Home > సినిమా

సినిమాల్లో నటించాలని ముంబయిలో వాలిపోయిన రాధికకి సినీ అవకాశాలేమో గానీ.. చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయట.
#instagram
Home > సినిమా

సినీ ఇండస్ట్రీలో అందంగా కనిపించడం కోసం శరీరంలో మార్పులు చేసుకోవాలని కొందరు రాధికకి సలహా ఇచ్చారట.
#instagram
Home > సినిమా

కానీ, రాధికకు తను తనలా ఉండటమే ఇష్టం. అందుకే.. కొన్ని సినిమాల్లో అవకాశాలు కోల్పోయాయని ఆమె ఓ సందర్భంలో చెప్పింది.
#instagram
Home > సినిమా

ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. 2005 నుంచి 2010 వరకు ఏడు సినిమాల్లో నటించింది. రామ్‌ గోపాల్‌ వర్మ రక్తచరిత్ర 1,2లోనూ రాధిక నటించింది.
#instagram
Home > సినిమా

ఆ తర్వాత అవకాశాలేమీ రాకపోవడంతో లండన్‌ వెళ్లిపోయింది. అక్కడే బెనెడిక్ట్‌ టేలర్‌ పరిచయం కావడం, ఆయనతోపాటు ముంబయికి రావడం రాధిక జీవితాన్నే మార్చేసింది.
#instagram
Home > సినిమా

2011 నుంచి ఆమె సినీ కెరీర్‌ పుంజుకుంది. తెలుగు, హిందీ, బెంగాళీ, మరాఠీ, తమిళ్‌ చిత్రాల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. హిందీలో పాడ్‌మ్యాన్‌ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
#instagram
Home > సినిమా

బాలకృష్ణతో ‘లెజెండ్‌’, ‘లయన్‌’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కోలీవుడ్‌ ‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్‌కు భార్యగా నటించింది.
#instagram
Home > సినిమా

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు ఓటేసే ఈ భామ.. బోల్డ్‌ సన్నివేశాల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఓ చిత్రంలో అర్ధనగ్నంగా కనిపించి షాకిచ్చింది. దీంతో అప్పట్లో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి.
#instagram
Home > సినిమా

ఇక సోషల్‌మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉంటుంది. గ్లామరస్‌ ఫొటోల పోస్టులతోనే కాదు.. ఘాటు వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది రాధిక.
#instagram
Home > సినిమా

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదన్న ఆమె.. కేవలం వీసా కోసమే బెనెడిక్ట్‌ టేలర్‌ను వివాహం చేసుకున్నానని వెల్లడించింది.
#instagram
Home > సినిమా

సినీ ఇండస్ట్రీలోనూ కీలక స్థానాల్లో మహిళలే ఉండాలని, అప్పుడే ప్రతిభకు చోటు, స్త్రీ సాధికారత సాధ్యమవుతుందని అంటోంది. ప్రస్తుతం రాధిక బాలీవుడ్‌ ‘విక్రమ్‌ వేద’ రీమేక్‌, ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’ చిత్రాల్లో నటిస్తోంది.
#instagram