Home

సులభమైన పొదుపు.. రికరింగ్‌ డిపాజిట్‌

Home > బిజినెస్‌

రికరింగ్ డిపాజిట్‌ (ఆర్‌డీ) ఖాతాతో వినియోగ‌దారులు సుల‌భంగా డ‌బ్బు ఆదా చేయ‌వ‌చ్చు.
#Eenadu
Home > బిజినెస్‌

బ్యాంకులు ఆర్‌డీ ద్వారా ప్ర‌తినెలా ఖాతాదారులకు నచ్చిన మొత్తాన్ని, ఎంచుకున్న కాల‌ప‌రిమితికి పెట్టుబ‌డులు పెట్టే సౌల‌భ్యాన్ని అందిస్తున్నాయి.
#Eenadu
Home > బిజినెస్‌

ఆర్‌డీ ఖాతా కాలపరిమితి 6 నెలల నుంచి 10 సంవత్సరాల వ‌ర‌కు ఉంటుంది.
#Pixabay
Home > బిజినెస్‌

పొదుపు లేదా క‌రెంట్ ఖాతా నుంచి ప్ర‌తి నెలా నిర్ధిష్ట మొత్తాన్ని ఆర్‌డీకి బ‌దిలీ చేయాలని ఖాతాదారులు బ్యాంకుల‌కు సూచ‌న‌లు చేయొచ్చు.
#Eenadu
Home > బిజినెస్‌

ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేటు మీరు ఎంచుకున్న బ్యాంక్‌, కాల‌వ్య‌వ‌ధుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కాలవ్యవధి ముగిశాక మెచ్యూరిటీ(పెట్టుబడి + వడ్డీ) మొత్తాన్ని చెల్లిస్తారు.
#Pixabay
Home > బిజినెస్‌

ఆర్‌డీ ఖాతాపై బ్యాంకులు పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌వు. కానీ, డిపాజిట్‌పై రుణం పొందే వీలుంది. డిపాజిట్ విలువ‌లో 80 నుంచి 90 శాతం రుణం పొందొచ్చు.
#Eenadu
Home > బిజినెస్‌

ఖాతాను మధ్యలో నిలిపివేస్తే.. బ్యాంకులు జరిమానా విధిస్తాయి. సాధారణంగా ఇచ్చే వడ్డీ రేట్ల కంటే తక్కువగా వ‌డ్డీ అందిస్తాయి.
#Eenadu
Home > బిజినెస్‌

రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను పడుతుంది. దీనిని ఇతర ఆదాయ వనరుగా లెక్కించి మీ మొత్తం ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు.
#Eenadu
Home > బిజినెస్‌

ఆర్‌డీ ఖాతా మూసివేయాలంటే.. ఆఫ్‌లైన్ ద్వారా మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఖాతా ర‌ద్దు చేయాల్సిందిగా అభ్య‌ర్థ‌న ప‌త్రం ఇవ్వ‌చ్చు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా కూడా ఖాతాను మూసివేయ‌వ‌చ్చు.
#Eenadu