Home

సప్త వ్యసనాలు ఏవో తెలుసా?

Home > ఆధ్యాత్మికం

పరస్త్రీ వ్యామోహం

పరాయి స్త్రీల మీద వ్యామోహంలో, వ్యభిచారపు మత్తులో ఉన్నవాడు దేన్నీ పట్టించుకోడు. సంపాదించిన సొమ్మును వాటికే ఉపయోగిస్తాడు. సీతాదేవిని అపహరించి.. ప్రాణాలు కోల్పోయిన రావణాసురుడే ఇందుకు ఉదాహరణ.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

జూదం

జూదం అలవాటు మహా చెడ్డది. ధర్మరాజు అంతటి వాడే జూదం వల్ల సర్వం కోల్పోయి అరణ్యవాసంలో కష్టాలు పడాల్సి వచ్చింది.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

మద్యం

మద్యపానం ఒక్కసారి అలవాటైతే వదులుకోవడం చాలా కష్టం. మద్యం సేవించిన మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ మత్తులో దారుణాలకు ఒడిగట్టే ప్రమాదముంది.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

వేట

ఒకప్పుడు రాజులకు వేట అనేది ఒక సరదా ఆట! కానీ, మూగ జీవాలను వేంటాడి చంపడం దుర్మార్గమైన పని. జంతువులపై దయ చూపకుండా వాటి ప్రాణాలతో చెలగాటం ఆడటం కూడా ఒక చెడ్డ వ్యసనమే.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

కఠినంగా మాట్లాడటం

ఎదుటి వాళ్లను గౌరవించకపోవడమే కాకుండా, కఠినంగా మాట్లాడటం.. తిట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. నోటి దురుసుతో మాట్లాడితే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

కఠినంగా శిక్షించడం

తప్పు చేసిన వాళ్లని శిక్షించడంలో తప్పు లేదు. కానీ, కొందరు చిత్రహింసలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతుంటారు. అది వారికి ఒక వ్యసనంగా మారుతుంది. ఇది అంత శ్రేయస్కరం కాదు. బాధితులెవరైనా పగతీర్చుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలే పోవచ్చు.
#Pixabay
Home > ఆధ్యాత్మికం

డబ్బు దుబారా

డబ్బు అందరికీ ముఖ్యమే. కానీ, కొందరు ఆ డబ్బుకు విలువ ఇవ్వకుండా వృథా ఖర్చు చేస్తుంటారు. పొదుపు చేయాలన్న ఆలోచన లేకుండా ఖర్చు చేస్తూ పోతే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అన్ని కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుంది.
#Pixabay