Home

ఈ తారలు నటనతోనే కాదు.. పాటలతోనూ మెప్పిస్తున్నారు!

Home > సినిమా

మమతా మోహన్‌దాస్‌

యమదొంగ, చింతకాయల రవి, కింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మమతా మోహన్‌దాస్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే ఆమె మంచి గాయని.
#Instagram
Home > సినిమా

ఎన్టీఆర్‌ ‘రాఖీ’.. నాగార్జున ‘కింగ్‌’ చిత్రాల్లో టైటిల్‌ సాంగ్స్‌, జగడంలో ‘36-24-36’, యమదొంగలో ‘ఒలమ్మీ తిక్కరేగిందా’, శంకర్‌దాదా జిందాబాద్‌లో ‘ఆకలేస్తే అన్నం పెడతా’ పాటలు ఆమె పాడినవే.
#Instagram
Home > సినిమా

నిత్యా మీనన్‌

అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. కేరళ కుట్టి నిత్యా మీనన్‌. మలయాళీ బొద్దుగుమ్మే అయినా.. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. అంతేనా.. పాటలు పాడి ఆకట్టుకుంది.
#Instagram
Home > సినిమా

తెలుగులో తన తొలిచిత్రంలో ‘అమ్మమ్మో.. అమ్మో అమ్మాయి’, ఇష్క్‌లో ‘ఓ ప్రియా ప్రియా’, జబర్దస్త్‌లో ‘నిన్నిలానే చూస్తూఉన్నా’, గుండె జారి గల్లంతయ్యిందేలో ‘తుహీరే.. తుహీరే’ పాటలు పాడింది నిత్య.
#Instagram
Home > సినిమా

శ్రుతిహాసన్‌

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందే మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్షన్‌ కూడా చేసింది.
#Instagram
Home > సినిమా

సెవన్త్‌ సెన్స్‌లో ‘ఏలేలెమా’, ఓ మై ఫ్రెండ్‌లో ‘శ్రీచైతన్య జూనియర్‌ కాలేజ్‌’, రేసుగుర్రంలో ‘డౌన్‌ డౌన్‌ డౌన్‌ డప్పా’ పాటలతో మెప్పించింది. ప్రైవేటు ఆల్బమ్స్‌ కూడా చేస్తోంది.
#Instagram
Home > సినిమా

రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసి.. గ్లామరస్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది నటి రాశీ ఖన్నా.
#Instagram
Home > సినిమా

2014లోనే ‘జోరు’ సినిమా టైటిల్‌ సాంగ్‌తో గాయనిగా మారిందీ భామ. తర్వాత జవాన్‌లో ‘బంగారు’, నారా రోహిత్‌ హీరోగా ‘బాలకృష్ణుడు’ సినిమాలో ఓ పాట పాడింది.
Home > సినిమా

ఆండ్రియా జెరెమియా

గాయనిగా, నటిగా విజయవంతంగా దూసుకెళ్తోంది ఆండ్రియా. యుగానికి ఒక్కడు చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మడు పాటల జాబితా పెద్దగానే ఉంది.
#Instagram
Home > సినిమా

రాఖిలో ‘జరజరా’, దేశముదురులో ‘గిలిగిలిగా’, దడలో ‘దివాళీ దీపాన్ని’, అపరిచితుడులో ‘నీకు నాకు నోకియా’, భరత్‌ అనే నేనులో ‘ఇదే కలలా ఉన్నదే’ పాటలు పాడింది ఆండ్రియానే.
#Instagram
Home > సినిమా

స్వాతి

కలర్స్‌ స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఈ నాటీ బ్యూటీ.. డేంజర్‌ సినిమాతో వెండితెరపై మెరిసింది. గాయనీగా తొలి అవకాశం ఇచ్చింది మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీప్రసాద్‌.
#Facebook
Home > సినిమా

100% లవ్‌లో ‘ఏ స్క్వేర్‌.. బీ స్క్వేర్‌’పాట పాడింది స్వాతి. ఆ తర్వాత స్వామి రారాలో ‘యే యే యే మేమంతా’, కేఎస్‌డీ అప్పలరాజులో ‘అన్‌బిలీవబుల్‌’ పాటలతో అలరించింది.
#Facebook
Home > సినిమా

కాజల్‌ అగర్వాల్‌

టాలీవుడ్‌ అగ్ర హీరోలందరితో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిన నటి.. కాజల్‌ అగర్వాల్‌. తను కూడా ఓ కన్నడ సినిమా కోసం పాట పాడింది.
#Instagram
Home > సినిమా

దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ‘యెనైతు’ అనే పాటను మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌.. కాజల్‌తో పాడించాడు.
#Instagram
Home > సినిమా

మంచు లక్ష్మి

మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి.. నటిగానే కాకుండా నిర్మాత, వ్యాఖ్యాతగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. అంతేకాదు.. గాయనిగానూ ప్రతిభ చాటుకుంది.
#Instagram
Home > సినిమా

దొంగాట సినిమాలో ‘ఏందిరో.. ఎట్టాగ’ పాట పాడిన మంచు లక్ష్మి.. నేను సైతం అనే టీవీ కార్యక్రమం టైటిల్‌ సాంగ్‌కు గాత్రం అందించింది.
#Instagram