Home

ఏకాగ్రత ఉండట్లేదా? ఈ చిట్కాలు పాటిస్తే సరి..

Home > లైఫ్‌స్టైల్‌

కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేద్దామన్నా ఏకాగ్రత కుదరకపోవచ్చు. మనసు, ఆలోచనలు ఎటువైపో.. వెళ్తుంటాయి. అలా జరగకుండా.. పనిపైనే ఏకాగ్రత కలగాలంటే కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటించి చూడండి..
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పోమోడోరో టెక్నిక్‌

పని గంటలను 25 నిమిషాల చొప్పున భాగాలుగా విభజించుకోవాలి. ఈ ఒక్క సెషన్‌ని పోమోడోరోగా పిలుస్తారు. ఒక పోమోడోరో ముగిసిన వెంటనే 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా తయారవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వ్యాయామం

వ్యాయామంతో రోజును ప్రారంభిస్తే మెదడులోని నరాలు, కార్టిసాల్‌ హార్మోన్లు చురుగ్గా తయారవుతాయట. కనీసం 20 నిమిషాలైనా నడక, యోగా, ప్రాణాయామం చేస్తే.. ఏకాగ్రత కుదురుతుంది.
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ధ్యానం

రోజుకి పది నిమిషాల చొప్పున కనీసం ఎనిమిది వారాలపాటు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒకే పనిని పదే పదే చేస్తుంటే మెదడులో అంతర్లీనంగా అది రికార్డు అవుతుంది.
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఒకేపని

ఒకే సమయంలో నాలుగైదు రకాల పనులు చేస్తే ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తుంటారు చాలామంది. కానీ మన మెదడు ఈ మల్టీ టాస్కింగ్‌కి అనుగుణంగా తయారు కాలేదు. ఇలా చేస్తే దేని మీద కూడా పూర్తి ఏకాగ్రత పెట్టలేం. అందుకే ఒకే సమయంలో ఒకే టాస్క్‌ పెట్టుకోవాలి.
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మెదడుకు శిక్షణ

మెదడుకి ఎక్కువ ఆక్సిజన్‌ అందించడం ద్వారా మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్‌, హిప్పోక్యాంపస్‌ ఉత్తేజితమై చురుగ్గా పని చేస్తుందట. పజిల్స్‌ పూర్తి చేయటం, చెస్‌ ఆడటం, సృజనాత్మకంగా ఆలోచించడం.. ఇవన్నీ మెదడుకి ఆక్సిజన్‌ ఇచ్చే వ్యాయామాలు.
#pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వాతావరణం

మన చుట్టూ ఉన్న వాతావరణం సైతం పనిలో ఏకాగ్రత కుదరడానికి కారణమవుతుంది. గదిలో మంచి వెలుతురు వచ్చేలా, సౌకర్యవంతంగా కూర్చునేలా, సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల చిరాకు పెట్టించే, అదేపనిగా కబుర్లు చెప్పే వ్యక్తులు లేకుండా చూసుకోవాలి.
#pixabay