Home

మేధా శక్తి పెరగాలంటే..

Home > లైఫ్‌స్టైల్‌

కొత్త భాష నేర్చుకోవడం

ఎక్కువ భాషలు తెలిసినవారి మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. ఒక భాష మాట్లాడేవారితో పోలిస్తే రెండు భాషలు మాట్లాడేవారికి డిమెన్షియా ముప్పు తక్కువ. అందువల్ల ఏదైనా కొత్త భాష నేర్చుకోవటానికి ప్రయత్నించటం మంచిది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

సంగీతం వినటం, సాధన చేయటం

భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి, శారీరక కదలికలకు తోడ్పడే వాటితో పాటు మెదడులోని అన్ని భాగాలనూ సంగీతం ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల కొత్త తరహా సంగీతం వినటం, వీలైతే ఏదైనా వాయిద్యాన్ని వాయించటం నేర్చుకోవచ్చు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

బోర్డు ఆటలు

చదరంగం వంటి ఆటలు మెదడుకు పదును పెడతాయి. జ్ఞాపకాలను వెలికితీసే సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేస్తాయి. ఒక్క చదరంగమే కాదు.. పులి జూదం, అష్టా చెమ్మా వంటివీ మేలు చేస్తాయి. మోనోపలీ, చెకర్స్‌ వంటి బోర్డు గేమ్‌లూ ఉపయోగపడతాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ప్రయాణాలు

కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త శబ్దాలను వినటం వల్ల మెదడుకి కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆయా అనుభూతుల మూలంగా మెదడులో నాడీవ్యవస్థ పనితీరూ మారుతుంది. పరిస్థితులకు అనుగుణంగా స్పందించటమూ మెరుగవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

నాటకాలు, సినిమాలు చూడటం

సాంస్కృతిక కార్యక్రమాలు మెదడుకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. తేలికగా అర్థమయ్యే వాటికి బదులు కాస్త కష్టపడి అర్థం చేసుకోవాల్సిన నాటకాలో, సినిమాలో అయితే బుర్రకు ఇంకాస్త పదును పెడతాయి. సబ్‌టైటిల్స్‌ చూడకుండా ఆయా పాత్రలు మాట్లాడే మాటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పజిల్స్‌ పరిష్కరించటం

పదకేళీలు, సుడోకు వంటివి ఏకాగ్రత, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి వంటి సామర్థ్యాలు పెరగటానికి తోడ్పడతాయి. అందువల్ల వీలున్నప్పుడల్లా వీటిని సాధన చేయటం మంచిది. రోజూ ఒకేరకం పజిల్స్‌ కాకుండా మార్చి మార్చి పరిష్కరించటం అలవాటు చేసుకోవాలి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఆహారం

టమాటో, డ్రైఫూట్స్‌, ఆకుకూరలు, బీట్‌రూట్, తేనె, డార్క్‌ చాక్లెట్స్‌, గ్రీన్‌ టీ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో తగినంత నీటిస్థాయి ఉంటుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. మెదడు చురుగ్గా ఉంటుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వ్యాయామం

వ్యాయామం శరీరానికి, ఆరోగ్యానికే కాదు.. మెదడుకూ మేలు చేస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పలు న్యూరోట్రాన్స్‌ మీటర్స్‌ వ్యాయామం చేయడం వల్ల విడుదలవుతాయి. మెదడు గరిష్ఠ స్థాయిలో పనిచేస్తుంది.
#Pixabay