Home

కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా? ఇలా మసులుకోండి!

Home > లైఫ్‌స్టైల్‌

మీరు పనిచేసే చోటు, పని గంటలు, వేతనం, ప్రయోజనాలు... ఇలా అన్నింటి గురించి మీకున్న సందేహాలను సహోద్యోగులను కాకుండా మానవ వనరుల అధికారుల్ని ముందే అడిగి తెలుసుకోండి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఆఫీసు వాతావరణాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉండే ఆహార్యాన్ని ఎంచుకోండి. సమయానికి కార్యాలయానికి వచ్చేలా ప్రణాళికలు వేసుకోండి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

కొన్ని సంస్థలు పని వేళల్లో ఉద్యోగులు మొబైల్‌, సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడానికి అంగీకరించవు. అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో ముందే కనుక్కోండి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎక్కువగా వినడానికే ప్రాధాన్యం ఇవ్వండి. సహోద్యోగులు, సీనియర్స్‌ చెప్పే సలహాలు, సూచనలు పాటించండి. సంస్థ గురించి తెలుసుకోండి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పనులను వాయిదా వేయొద్దు. లేదంటే చివర్లో ఇబ్బంది పడతారు. ఆలస్యమైనా, తప్పు చేసినా మీపై వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదముంటుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

సహోద్యోగులతో కలసిమెలసి ఉండాలి. పని విషయంలో సహాయాన్నీ అందించాలి.. తీసుకోవాలి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

కొందరు సహోద్యోగులు నెగెటివ్‌ భావాన్ని, నిరాశను కలిగిస్తుంటారు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.
#Pixabay