Home

స్పెషల్‌ సాంగ్స్‌తో అదరగొడుతున్న కథానాయికలు!

Home > సినిమా

పూజా హెగ్డే

కెరీర్‌లో దూసుకెళ్తున్న సమయంలోనే రంగస్థలం చిత్రంలో ‘జిగేలు రాణి’గా ఆడిపాడింది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా.. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన‘ఎఫ్‌-3’లోని ప్రత్యేక పాటలో మరోసారి మెరిసింది.
#Twitter
Home > సినిమా

సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా ఊహించని విధంగా ‘పుష్ప’ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటలో కనిపించి.. ఔరా అనిపించింది. ‘ఊ అంటావా మావా..’ అంటూ హుషారెత్తించే ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది.
#Twitter
Home > సినిమా

కాజల్‌

ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం ఓ ప్రత్యేక పాట చేసేందుకు సై అంది. ‘జనతా గ్యారేజీ’ చిత్రంలో ‘పక్కా లోకల్‌.. ’ అంటూ ఊర మాస్‌గా చిందేసింది.
#Twitter
Home > సినిమా

తమన్నా

టాలీవుడ్‌ ప్రత్యేక పాటల్లో అత్యధికంగా ఆడిపాడిన స్టార్‌ నటి తమన్నానే. అల్లుడు శీను, జై లవకుశ, కేజీఎఫ్‌ చాప్టర్‌ 1, సరిలేరు నీకెవ్వరు, గని చిత్రాల్లో ప్రత్యేక పాటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది తమన్నా.
#Twitter
Home > సినిమా

శృతి హాసన్‌

మహేశ్‌ బాబు నటించిన ‘ఆగడు’ చిత్రంలోని ‘జంక్షన్‌లో..’ అంటూ సాగే ప్రత్యేక పాటకు శృతి హాసన్‌ స్టెప్పులేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ పాట మాత్రం హిట్‌ కొట్టింది.
#Twitter
Home > సినిమా

అంజలి

అల్లు అర్జున్‌ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరైనోడు’. ఇందులో ‘బ్లాక్‌ బాస్టర్‌..’ అనే పాటలో అంజలి నటించింది. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించే అంజలి.. ఓ ప్రత్యేక పాటలో కనిపించడం విశేషం.
#Twitter
Home > సినిమా

ఫరియా అబ్దుల్లా

‘జాతి రత్నాలు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిట్టి.. యువకుల గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇటీవల విడుదలైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో మెరిసింది.
#Twitter
Home > సినిమా

రెజీనా

తొలి చిత్రం(ఎస్‌ఎంఎస్‌)తోనే ‘సైమా’ అవార్డును గెలుచుకున్న నటి రెజినా. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, జో అచ్యుతానంద, ఆ..!, తదితర చిత్రాలతోపాటు తమిళ్‌, కన్నడ, హిందీలోనూ నటించింది. తాజాగా చిరంజీవి-రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రంలో ‘సానా కష్టం..’ పాటలో చిరుతో ఆడిపాడింది.
#Twitter
Home > సినిమా

హెబ్బా పటేల్‌

కుమారి 21ఎఫ్‌ చిత్రంతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. హెబ్బా పటేల్‌. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా పెద్దగా పాపులారిటీ సాధించలేదు. హీరో రామ్‌ నటించిన ‘రెడ్‌’ చిత్రంలోని ‘డించాక్‌..’ పాటలో కనిపించి మరోసారి కుర్రాళ్ల గుండెని గిల్లింది.
#Twitter