Home

ఇల్లు కొంటున్నారా? ఇవి చెక్‌ చేయండి

Home > బిజినెస్‌

సేల్‌ డీడ్‌

ఆస్తుల క్రయవిక్రయాల్లో కీలకమైంది సేల్‌ డీడ్‌. ఇందులో విక్రేత, కొనుగోలుదారు, ఆస్తికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
#Eenadu
Home > బిజినెస్‌

బిల్డింగ్‌ అప్రూవల్‌ ప్లాన్‌

ఇల్లు నిర్మించే ముందు యజమాని స్థానిక మున్సిపల్‌ అధికారుల నుంచి బిల్డింగ్‌ అప్రూవల్‌ ప్లాన్‌ ఆమోదం పొందాలి. మరి అది మీరు కొనే ఇంటికి ఉందో లేదో చెక్‌ చేయాలి.
#Unsplash
Home > బిజినెస్‌

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌

నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణం జరిగినట్లు స్థానిక ప్రభుత్వం జారీ చేసే పత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌. మీరు కొనే ఇంటికీ ఈ సర్టిఫికెట్‌ ఉండాలి.
#Pixabay
Home > బిజినెస్‌

ఇంటి పన్ను రశీదులు

ఇంటి పన్ను చెల్లింపునకు సంబంధించిన రశీదులను అడగాలి. అందులో యజమాని వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. పన్ను బకాయిలు ఉంటే అవి చెల్లించే బాధ్యత విక్రేతదే.
#Eenadu
Home > బిజినెస్‌

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌

ఇందులో ఆస్తికి సంబంధించి యజమాని వివరాలు, ఇప్పటి వరకు ఆస్తిపై జరిగిన లావాదేవీల వివరాలుంటాయి. ఆస్తిపై ఏదైనా రుణాలున్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఈ సర్టిఫికెట్‌ తెలియజేస్తుంది.
#Eenadu
Home > బిజినెస్‌

ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌

ఒకవేళ మీరు డెవలపర్ల వద్ద ఇల్లు కొనుగోలు చేస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ ఉందో లేదో అడగాలి. ఎన్‌ఓసీ లేకపోతే చిక్కుల్లో పడతారు.
#Pixabay
Home > బిజినెస్‌

ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌

మున్సిపల్‌ రికార్డుల్లో ఆస్తి వివరాలు, ఆస్తి యజమాని వివరాలు నమోదై ఉంటే యజమానికి ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే కొనుగోలు చేయడం మంచిది.
#Pixabay
Home > బిజినెస్‌

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌

ఇల్లు ఇది వరకే బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటే.. రుణం చెల్లింపులు పూర్తయి, బకాయిలు ఏమీ లేవని తెలిపే బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను తీసుకోవాలి.
#Pixabay
Home > బిజినెస్‌

పవర్‌ ఆఫ్‌ అటార్నీ

యజమాని తన తరఫున మరో వ్యక్తికి ఆస్తిపై హక్కులు ఇవ్వడానికి ఉన్న చట్టపరమైన ప్రక్రియ ఇది. దీని ద్వారా ఒకరి ఆస్తికి మరొకరు హక్కుదారు కావొచ్చు. ఇలాంటివి ఏమైనా ఉన్నయేమో చూడాలి.
#Pixabay
Home > బిజినెస్‌

ల్యాండ్‌ కన్వర్షన్‌ సర్టిఫికెట్‌

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు ఉపయోగిస్తే అందుకు ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ కన్వర్షన్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు కొనుగోలు చేసే ఆస్తి వ్యవసాయ భూమిలో ఉంటే.. ఈ సర్టిఫికెట్‌ కచ్చితంగా అడగాలి.
#Eenadu