Home

చాక్‌పీస్‌ను ఇలా కూడా వాడొచ్చు..!

Home > లైఫ్‌స్టైల్‌

దుస్తులు, లెదర్‌ వస్తువులపై నూనె మరకలు పడ్డప్పుడు చాక్‌పీస్‌తో రుద్ది, ఒక పది నిమిషాల తర్వాత దులిపేయాలి. మరకలు మాయమవుతాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వెండి, రాగి, ఇత్తడి వస్తువులు నల్లబడితే.. వాటిని చాక్‌పీస్‌ పొడితో శుభ్రం చేస్తే సరి! తిరిగి అవి తళతళమని మెరుస్తాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

చాక్‌పీస్‌ పొడిని గుడ్డలో కట్టి తడిగా ఉన్న లేదా చెమట వాసన ఉన్న షూలలో ఉంచాలి. ఇలా చేస్తే తడి, వాసన పోయి షూలు శుభ్రమవుతాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పేపర్‌ మీద టీ/ కాఫీ/నీళ్లు ఒలికిపోతే.. ఆ తడి మీద చాక్‌పీస్‌ను దొర్లించండి. నీరంతా చాక్‌పీస్‌ పీల్చుకుంటుంది. పేపర్‌ తొందరగా ఆరుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

చాక్‌పీస్‌ని కాస్త గ్యాసోలిన్‌ నూనె లేదా లెమన్‌ గ్రాస్‌ ఎసెన్షియల్‌ నూనెలో తడిపి గోడ వెంబడి గీస్తే చీమలు ఆ ప్రదేశానికి రాలేవు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పాత దుస్తులు, దుప్పట్లు పెట్టే ప్రదేశంలో చాక్‌పీసులను ఒక పల్చని గుడ్డలో కట్టి ఉంచితే.. ముతక వాసన రాదు.
#Pixabay