Home

హోం లోన్‌ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

Home > బిజినెస్‌

క్రెడిట్‌ స్కోర్‌ 750కి మించి ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ. అలాంటి వారికి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
#Eenadu
Home > బిజినెస్‌

వీలైనంత ఎక్కువగా డౌన్‌పేమెంట్‌ కడితే భవిష్యత్తులో రుణ భయం ఉండదు. రుణం మంజూరయ్యే అవకాశాలూ మెరుగుపడుతాయి. ఈఎంఐ భారమూ తగ్గుతుంది.
#Eenadu
Home > బిజినెస్‌

రుణం తీసుకున్నప్పుడు ఈఎంఐ చెల్లించే సామర్థ్యం ముఖ్యం. అందుకే గత రుణ బకాయిలను ముందే క్లియర్‌ చేస్తే ప్రస్తుత ఈఎంఐని సులభంగా చెల్లించవచ్చు.
#Eenadu
Home > బిజినెస్‌

ఆదాయానికి మించి ఈఎంఐలు లేకుండా చూసుకోవాలి. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ 50-60 శాతానికి ఎక్కువ కాకుండా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి.
#Eenadu
Home > బిజినెస్‌

ఏ క్షణంలో ఎలాంటి ఆర్థిక విపత్తు సంభవిస్తుందో తెలియదు. అందుకే అత్యవసర నిధి కింద ఆరు నెలల ఈఎంఐకి సరిపడా డబ్బులు పెట్టుకోవాలి.
#Eenadu
Home > బిజినెస్‌

రుణం కోసం ఒకే బ్యాంకును కాకుండా వేర్వేరు బ్యాంకులను సంప్రదించాలి. వడ్డీ రేట్లు, కాలపరిమితి, ఇతర విషయాలు చూసుకోవాలి.
#Eenadu
Home > బిజినెస్‌

నిర్దిష్ట ఆదాయం ఉన్న సహ దరఖాస్తుదారు ఉంటే రుణం తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు స్త్రీ అయితే కొన్ని సంస్థలు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.
#Eenadu
Home > బిజినెస్‌

రుణానికి సంబంధించి బ్యాంకు డాక్యుమెంట్లలో పేర్కొన్న నిబంధనలు, షరతులు కచ్చితంగా చదవాలి. వీలు కాకుంటే ఆర్థిక నిపుణుల సాయం తీసుకోవాలి.
#Eenadu
Home > బిజినెస్‌

మీ వద్ద ఎక్కువ మొత్తం డబ్బు ఉన్నప్పుడు అదనపు ఈఎంఐ కడితే గృహ రుణం అనుకున్న సమయం కంటే ముందుగానే తీరిపోతుంది.
#Eenadu