చిత్రం చెప్పే విశేషాలు
(11-01-2024/2)
శీతాకాలం దృష్ట్యా పలు దేశాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలస్కాలో కూడా మంచు విపరీతంగా కురుస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన 20 అడుగుల కంటే ఎత్తు ఉన్న ఓ స్నోమ్యాన్ ఆకట్టుకుంటోంది.
నూట ఎనిమిది అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకలు (హైదరాబాద్ నుంచి), 10 అడుగుల తాళంచెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారం.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకు ఎన్నో ప్రత్యేక కానుకలు అందుతున్నాయి.
నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా మేనన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. హైదరాబాద్‌లో సినిమా ముందస్తు వేడుకను నిర్వహించారు.
అయోధ్య రైల్వే స్టేషన్ వద్ద ఉంచేందుకు నగరానికి చెందిన కళాకారుడు కల్యాణ్ ఎస్ రాథోడ్ భారీ శిల్పాన్ని తయారు చేశారు. శిల్పం 15 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువు ఉంది. ఉక్కు, ఇతర లోహాల మిశ్రమంతో కోర్టెన్ అనే లోహాన్ని తయారు చేసి శిల్పాన్ని రూపుదిద్దారు.
సాల్ట్ లేక్ సిటీలో డెల్టా సెంటర్ బయట బాస్కెట్ బాల్ ఉటాజాజ్ జట్టు ప్లేయర్ జాన్ స్టాక్‌టన్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహంపై ఇలా మంచు పడుతూ ఆకట్టుకుంది.
కర్ణాటకలోని బెళగావి సమీప బాసరగి గ్రామానికి చెందిన సచిన్ శివప్ప అనే రైతు మూడు అంగుళాల పొడవు ఉన్న ద్రాక్షను పండించి రూ.లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన ఈ వీఎస్‌డీ రకం ద్రాక్ష తినడానికి మెత్తగా ఉండటం వల్ల విపరీతమైన డిమాండు ఉంది.
వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడుగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సిద్ధు క్షేత్రి (42) పంచింగ్ బ్యాగుపై 55 గంటల 15 నిమిషాలపాటు పంచులు వేసి, గిన్నిస్ రికార్డు సాధించారు. నిబంధనల ప్రకారం ప్రతి సెకనుకు కనీసం ఒక పంచ్ వేయాల్సి ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరీ, గరియాబంద్ జిల్లాల సరిహద్దులో గల ఉదంతీ సీతానదీ టైగర్ రిజర్వు అడువుల్లో మొరిగే జింక కెమెరాకు చిక్కింది. కుక్కలా అరుస్తూ శబ్దాలు చేసే ఈ జింక రెయిన్‌డీర్ జాతికి చెందినదని, సాధారణ జింకలతో పోలిస్తే దీని శరీరం కాస్త భిన్నంగా ఉంటుంది.
ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో చెరువు నుంచి పంట కాలువకు, అక్కడి నుంచి మిరప పంటకు నీరు తరలించేందుకు రెండు డీజిల్ ఇంజిన్లు వాడి కిలోమీటరు మేర పైపులతో సాగు నీటిని రైతులు తరలిస్తున్నారు.