చిత్రం చెప్పే విశేషాలు

(17-11-2023/2)

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య హైదరబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో ఆటలు ఆడి, బహుమతులు అందజేశారు. 

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి ఆర్కే రోజా, జబర్దస్త్‌ టీం దర్శించుకున్నారు. ఇవాళ రోజా పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో పూజలు ఘనంగా జరిగాయి. పుట్టలో పాలు పోసి భక్తులు.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కనులపండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథాన్ని లాగారు. 

నటి సన్నీలియోన్‌ తాజాగా వారణాసిలో గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులు ధరించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ రాజస్థాన్‌లోని సగ్వారాలో ఉన్న గాయత్రీ పీఠంలో ఆర్య హవనం, పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం, రాష్ట్ర సంక్షేమం గురించి ప్రార్థించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో తాండూర్‌లో ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి రోహిత్‌ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలా రొట్టెలు చేశారు.

శుక్రవారం వరంగల్ చౌరస్తా నుంచి వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలి వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అనంతరం పోచమ్మ మైదాన్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు.

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(04-12-2023/3)

చిత్రం చెప్పే విశేషాలు (04-12-2023/2)

Eenadu.net Home