ఝార్ఖండ్‌ అందాల డైనమైట్‌

‘మీర్జాపుర్’ వెబ్‌సిరీస్‌ కొత్త సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సిరీస్‌లో కీలక నటి రసికా దుగ్గల్‌ గురించి ఓసారి చూద్దాం!

చిత్రీకరణ దశలో ఉన్న ‘మీర్జాపూర్‌ 3’ అమెజాన్‌ ప్రైమ్‌లో త్వరలో స్ట్రీమ్‌ అవుతుంది. 

‘మీర్జాపుర్‌ 1’లో నటనకుగానూ 2018లో ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డ్స్‌లో రసికా ఉత్తమ నటిగా నామినేట్‌ అయ్యింది.

ఆ తర్వాత వరుస వెబ్‌ సిరీసుల్లో నటించింది. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్’, ‘దిల్లీ క్రైమ్‌’, ‘అవుట్ ఆఫ్‌ లవ్‌’, ‘ఎ సూటబుల్‌ బాయ్‌’, ‘ఓకే కంప్యూటర్‌’, ‘స్పైక్‌’, ‘అధుర’ సిరీసులతో అలరించింది.

ఝార్ఖండ్‌కి చెందిన ఈమె బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. 

‘నో స్మోకింగ్‌’ (2007)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బుల్లి తెరపై అనేక సీరియళ్లతో అభిమానుల్ని సంపాదించుకుంది.

హిందీలోనే కాకుండా మలయాళంలోనూ తన సత్తా చాటింది. భావంతోనే కానీ భాషతో నాకు పనిలేదంటుంది రసికా.

ఈమెకి ఉర్దూ కవితలు చదవడమంటే ఇష్టం. ఎక్కువ సమయం సంగీతం వింటూ ఉంటుంది. 

This browser does not support the video element.

రసికాకి ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ. కఠినమైన నియమాలు, టైం టేబుల్ పెట్టుకొని ఫాలో అవుతుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌. ఇంట్లో వారితో కలసి చేసిన రీల్స్‌ను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. 

This browser does not support the video element.

విహారయాత్రల విషయానికొస్తే.. ప్రకృతిలో గడపడం ఇష్టమట. ఎప్పుడూ అడవులు, కొండల మధ్యలో పచ్చదనాన్ని ఆస్వాదిస్తుంటుంది.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home