సినిమాకి బ్రేక్‌ వద్దని.. నాన్‌వెజ్‌ తిన్నా!

బాలీవుడ్‌లో ‘బడే మియా చోటే మియా’తో అలరించిన మానుషి చిల్లర్ ప్రస్తుతం ‘తెహ్రాన్‌’లో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

తెలుగులో వరుణ్‌ తేజ్‌ సరసన ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’లోనూ కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఛాన్స్‌లు రాలేదు.

This browser does not support the video element.

ఇప్పుడు వివిధ మ్యాగజీన్ల కవర్‌ ఫొటోలకు పోజులిస్తూ బిజీగా ఉంది మానుషి. ట్రెండీ లుక్స్‌తో ఉన్న ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఓ పక్క సినిమాలు చేస్తూనే వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. స్విమ్‌ వేర్‌ ప్రత్యేకతగా ఓ బిజినెస్‌ చేస్తోంది. 

చిన్నతనం నుంచి మానుషి శాకాహారి. 2019లో పెటా సంస్థ ఆమెకు ‘ఇండియాస్‌ హాటెస్ట్‌ వెజిటేరియన్‌’ అవార్డును కూడా ఇచ్చింది. అయితే ఇటీవల సినిమా కోసం మాంసాహారిగా మారాల్సి వచ్చింది.

‘బడే మియా...’ షూటింగ్‌ సమయంలో మానుషికి కొవిడ్‌ సోకింది. అప్పుడే ఇంకో సినిమాకీ ఓకే చెప్పింది. ఆ సమయంలో బరువు తగ్గితే షూటింగ్‌కి బ్రేక్‌ పడుతుందని మాంసం తీసుకోవడం మొదలుపెట్టింది.

మానుషి చదువులోనూ ముందుంటుంది. ఆమె స్కూలు టాపర్‌. ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. 

డ్యాన్స్‌అంటే మహా ఇష్టం. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంది. స్విమ్ చేయడం బాగా నచ్చుతుంది. ఒత్తిడి తగ్గే మార్గమిదే అంటోంది.

ఇన్‌స్టాలో తరచూ ఫొటో షూట్లతో యువతను కట్టిపడేస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్లు 65 లక్షలకు పైమాటే!

ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడుతుంది. అయినా నచ్చిన ఆహారాన్ని లాగించేస్తుంది. తర్వాత దానికి సరిపడా వ్యాయామం చేస్తుంది. 

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home