చిత్రం చెప్పే విశేషాలు
(27-09-2024/1)
శుక్రవారం నిజామాబాద్‌లో సీఎమ్‌ఆర్ వస్త్ర దుకాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి పాయల్ రాజ్ పుత్, హీరో రామ్ హాజరై సందడి చేశారు.
సోమాజిగూడలోని విల్లామరీ కళాశాలో నవరాత్రి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలు, ఆటపాటలు, దాండియాతో సందడి చేశారు.
భద్రకాళీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన ఛైర్మన్ శేషు, ఈవో శేషుభారతి, సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం నివాసంలో ఆహ్వానాన్ని అందజేశారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారు ఆలయానికి విద్యుత్ అలంకరణ లు పూర్తి చేసి ఇంజనీరింగ్ అధికారులు పరీక్షించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. రూ.20 కోట్ల చెక్కును రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్‌కు అందజేశారు.
సెలబ్రిటీ దాండియా నైట్స్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో జరిగింది. సినీ నటి కీర్తి భట్, అశ్విని తదితరులు హాజరై సందడి చేశారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఊంజల్ సేవా పర్వాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దిన అమ్మవారి సేవను మంగళ వాయిద్యాలతో అద్దాల మండపానికి చేర్చి ఊయల సేవోత్సవాన్ని చేపట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. రూ.20 కోట్ల చెక్కును రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం అందజేసింది. భారత్ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చెక్‌ను అందజేశారు.