చిత్రం చెప్పే విశేషాలు-2 (11-03-2022)
హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో హైలైఫ్ సంస్థ ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి నటి గెహనా సిప్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
Source:Eenadu
ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు.. ప్రియాంక చోప్రాను కలిసి ముచ్చటించారు.
Source:Eenadu
ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్, ప్రీతి జింటా కలిసి సందడి చేశారు.
Source: Eenadu
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు.
Source:Eenadu
వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ ఇటీవల విడదులై మంచి టాక్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి శనివారం ఉదయం ‘బలగం’ చిత్రబృందాన్ని ప్రశంసించారు. తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ సెట్‌లో ‘బలగం’ టీమ్‌ను కలిసిన ఆయన చిత్రబృందాన్ని సన్మానించారు.
Source:Eenadu
జనసేన పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పవన్‌కల్యాణ్ ఫొటోను పంచుకుంది. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పోస్టు పెట్టింది. దీంతో పవన్ అభిమానులు, కార్యకర్తలు ‘మేము సిద్ధం’ అని కామెంట్లు పెడుతూ సంఘీభావం తెలుపుతున్నారు.
Source:Eenadu
నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని కోకాపేటలో నూతనంగా ఓ ఫర్నిచర్ దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి రిచా పనయ్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
సినీనటుడు విజయ్, దర్శకుడు కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం కశ్మీర్ వెళ్లి చిత్రీకరణలో పాల్గొన్నారు.
Source: Eenadu