చిత్రం చెప్పే విశేషాలు

(10-09-2024/1)

 కాలిఫోర్నియాలో జరిగిన ‘గ్లోటైమ్‌’ ఈవెంట్‌లో సిద్ధార్థ్‌-అదితిరావు హైదరిల జంట సందడి చేసింది. అక్కడ యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌ను కలిసి ఫొటోలు దిగారు.

బంజారాహిల్స్‌లో ఇండియన్‌ డిజైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. వివిధ రకాల నూతన వస్త్రాలను ప్రదర్శించారు. మోడల్స్‌ హాజరై ఫొటోలు దిగి సందడి చేశారు. 

వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్ల విరాళం సీఎం రేవంత్‌కు అందించారు. 

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మాదక ద్రవ్యాలు -నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా వాగ్దేవి కళాశాల, స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

 సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో సన్నాహక కవాతు ఏర్పాటు చేశారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి వినాయక నిమజ్జనాలను ట్యాంక్‌బండ్‌లో అనుమతించడం లేదని ట్రాఫిక్‌ పోలీసులు ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home