వహ్వా.. వహీదా..!

This browser does not support the video element.

సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరామండి..’లో నటించిన ఆ ఆరుగురు నటీమణుల గురించి ఇప్పుడు తెగ మాట్లాడుకుంటున్నారు. వారిలో సంజీదా షేక్‌ ఒకరు. 

‘హీరామండి’లో వహీదా పాత్రలో కనిపించిన సంజీదా.. ముఖం మీద గాటుతో, నెగిటివ్‌ రోల్‌లో అలరించింది.

సంజీదా 2003లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ ‘క్యా హోగా నిమ్మో కా’ అనే సీరియల్‌ ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 

సీరియళ్లు, షోలతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. ఈమె నటించిన ‘కున్‌ ఫయా కున్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

‘పొన్నియిన్‌ సెల్వన్ 1’, ‘శుభం’, ‘కాలీ కుహి’, ‘మెయిన్ తే బాపు’, ‘ఆష్కే’ వంటి పలు పంజాబీ, హిందీ చిత్రాలతో ఆకట్టుకుంది.

ప్రేమించి పెళ్లాడిన ఈమె ఎనిమిదేళ్ల తర్వాత 2020లో తన భర్త ఆమిర్‌ అలీ నుంచి విడాకులు తీసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. 

‘ఇర్ఫాన్‌ను స్ఫూర్తిగా తీసుకొని, మా అమ్మ సహాయంతో పరిశ్రమలోకి వచ్చాను. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఆడిషన్స్‌లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా’నని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరూ తోడుండరు. ఒక వేళ ఉన్నారంటే వారే నిజమైన ఆప్తులు. నాకు అండ కావాల్సినప్పుడు బంధువులెవ్వరూ సాయం చేయలేదు. ఇప్పుడు అందరూ నా దగ్గరికి వస్తారు ఎందుకంటే మంచి స్థాయిలో ఉన్నా కాబట్టి’ అని అంటోందీ బ్యూటీ.  

This browser does not support the video element.

కుమార్తె ఐరా అలీతో తీసుకున్న ఫొటోలు, వీడియోలతో ఇన్‌స్టాలో సందడి చేస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి ఫాలోవర్లు 4కోట్లకి పైమాటే.

 ‘షూటింగ్‌ లేకపోతే ఐరాతోనే ఉంటాను. తనే నా ప్రపంచం. తనతో ఉంటే అసలు సమయమే తెలియదు. చిన్న పిల్లలా తనతో కలిసి ఆడుకుంటుంటే నా ఒత్తిడి, కష్టాలు అన్నీ మర్చిపోతాను అని అంటోంది సంజీదా.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home