‘సరిపోదా శనివారం’లో తమిళ నటి

‘శాకుంతలం’లో అతిథి పాత్రతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన తమిళ నటి అదితి బాలన్‌. ఇప్పుడు నాని ‘సరిపోదా శనివారం’తో మళ్లీ వస్తోంది.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘సరిపోదా శనివారం’లో భద్రగా కనిపించబోతోంది అదితి బాలన్‌. ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది.

2015లో తమిళంలో ‘ఎంతవాడుగాని’తో తొలిసారి సినిమాల్లోకి వచ్చింది. అయితే అందులో ఈమెకు అంత గుర్తింపు దక్కలేదు.

2017లో ‘అరువి’తో తమిళంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘కుట్టి స్టోరీ’, ‘కోల్డ్‌ కేస్‌’, ‘పడవెట్టు’, ‘కరుమేగన్‌గల్‌ కలైగిన్‌డ్రన’, ‘వేళ’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తదితర తమిళ, మలయాళ చిత్రాలు చేసింది.

This browser does not support the video element.

చిన్నప్పట్నుంచే అదితికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంది. ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది.

క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు వెస్ర్టన్‌లోనూ ఈ బ్యూటీకి ప్రావీణ్యం ఉంది. స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది.

This browser does not support the video element.

సగటు అమ్మాయిల్లా స్నేహితులతో కలిసి సరదాగా ట్రిప్పులకి వెళుతుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి కూడా.

టాప్‌ 10 ప్రపంచ అందగత్తెలు.. అందులో మన బాలీవుడ్‌ సుందరి!

ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

60 నాటకాలు.. ఒక పుస్తకం.. మిస్‌ ఇండియా నిఖిత టాలెంట్‌

Eenadu.net Home