టాటా టెక్‌ ఐపీఓ.. 10 విషయాలు

టాటా టెక్నాలజీస్‌ ఐపీఓకు రాబోతోంది. టాటా గ్రూప్‌ నుంచి దాదాపు 2 దశాబ్దాల తర్వాత వస్తున్న ఐపీఓ ఇదీ. దీంతో మదుపరుల్లో అమితాసక్తి నెలకొంది.

 టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ ద్వారా రూ.3,042 కోట్లు సమీకరించనుంది.

నవంబరు 22న ప్రారంభం కానున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ 24న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించారు.

రిటైల్‌ మదుపరులు కనీసం 30 షేర్లు కొనాల్సి ఉంటుంది. దీని ప్రకారం గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.15 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఐపీఓలో తొలుత 9.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నారు. తర్వాత 6.08 కోట్ల షేర్లకు తగ్గించారు.

ఐపీఓలో 10 శాతం వాటాను ప్రత్యేకంగా టాటా మోటార్స్‌ వాటాదారుల కోసం రిజర్వ్‌ చేశారు. 20.28 లక్షల షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించారు.

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్‌ తమ వాటాలో 11.4% ఉపసంహరించుకుంటోంది. ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4%, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌-I 1.2% వాటాలను విక్రయిస్తున్నాయి. 

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా షేర్లను విక్రయిస్తుండడంతో ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తం వాటాదారులకే వెళ్లనుంది.

టాటా టెక్‌ విలువను చివరిసారి రూ.16,300 కోట్లుగా అంచనా వేశారు. కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. 11 వేల మంది ఉద్యోగులున్నారు.

ఈ కంపెనీ ఇంజినీరింగ్‌, పరిశోధన-అభివృద్ధి సేవలు, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌లో అందిస్తోంది. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ ప్రధాన కస్టమర్లు.

2022 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 15% పెరిగి రూ.3,052 కోట్లకు చేరింది. నికర లాభం రూ.407 కోట్లుగా నమోదైంది.

షేర్లను నవంబర్‌ 30న కేటాయించనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి రిఫండ్లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 4న షేర్ల బదిలీ.. 5న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్‌.

ఎఫ్‌ అండ్‌ ఓ కొత్త రూల్స్‌ తెలుసా..?

ఈవీల సబ్సిడీకి కొత్త పథకం

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే!

Eenadu.net Home