మీ మొబైల్‌ పోయిందా? వెంటనే ఇలా చేయండి..

మొదట పోయిన ఫోన్‌కు కాల్‌ చేసి చూడండి. ఎవరికైనా దొరికితే తిరిగిస్తారు. దొరికే ఆస్కారమే లేనప్పుడు మొబైల్‌లోని సమాచారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడాలి. image:Unsplash

పోయిన మొబైల్‌ను ‘ఫైండ్‌ మై డివైజ్‌’ అప్లికేషన్‌ ద్వారా గుర్తించే అవకాశముంది.

image:Unsplash

మొదట మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఉన్న జీమెయిల్‌ అకౌంట్‌తో మరో మొబైల్‌/పీసీలోని ‘ఫైండ్‌ మై డివైజ్‌’లో లాగిన్‌ అవ్వాలి.

image:Unsplash

అందులో మీ మొబైల్‌ వివరాలు కనిపిస్తాయి. ‘ప్లే సౌండ్‌’ బటన్‌ నొక్కితే 5 నిమిషాలపాటు మొబైల్‌ రింగ్‌ అవుతుంది. ఒకవేళ మొబైల్‌ను సైలెంట్‌లో పెట్టినా.. రింగ్‌ వినిపిస్తుంది.

image:Unsplash

మొబైల్‌లో నావిగేషన్‌ ఆన్‌ చేసి ఉంటే అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. ఆఫ్ చేస్తే మాత్రం గుర్తించలేం.

image:Unsplash

అప్పటికీ మొబైల్‌ దొరకపోతే ఈ అప్లికేషన్‌లోనే మొబైల్‌ను లాక్‌ చేసి, గూగుల్‌ అకౌంట్‌ నుంచి సైన్‌ అవుట్‌ కావొచ్చు.

image:Unsplash

ఆ మొబైల్‌లోని డేటాను పూర్తిగా డిలీట్‌ చేయాలనుకుంటే.. ‘ఎరేజ్ డివైజ్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. దీంతో మొబైల్‌లోని సమాచారమంతా డిలీట్‌ అవుతుంది.

image:Unsplash

నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌కి కాల్‌ చేసి సిమ్‌ కార్డు బ్లాక్‌ చేయించాలి. దీంతో బ్యాంకింగ్‌ ఓటీపీలు రావు. నగదు లావాదేవీలు జరగవు.

image:Unsplash

మీ మొబైల్‌తో ఇతరులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముంది. అందుకే మొబైల్‌ పోయినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

image:Unsplash

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 12 ప్రో.. వివరాలివీ!

బడ్జెట్‌ ధరలో ఒప్పో కొత్త మొబైల్‌!

బడ్జెట్‌ ధరలో మోటోరోలా మొబైల్స్‌ ఇవీ!

Eenadu.net Home