పొట్టి కప్‌.. 10 వికెట్ల తేడాతో విజయాలు 

టీ20 ప్రపంచ కప్‌ 2024 సూపర్‌-8లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

యూఎస్‌పై 116 పరుగుల టార్గెట్‌ని ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది.

పొట్టి కప్‌లో ఇలా ఒక్క వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించిన జట్లు మరికొన్ని ఉన్నాయి. ఆ జట్లేవో చుద్దాం. 

విజేత: ఆస్ట్రేలియా 

టార్గెట్: 102 

ఎన్ని ఓవర్లలో ఛేదించింది: 10.2 ఓవర్లు  

ప్రత్యర్థి: శ్రీలంక (2007) 

విజేత: దక్షిణాఫ్రికా

టార్గెట్: 94

ఎన్ని ఓవర్లలో ఛేదించింది: 12.4 ఓవర్లు 

ప్రత్యర్థి: జింబాబ్వే (2012) 

విజేత: ఒమన్‌

టార్గెట్: 130

ఎన్ని ఓవర్లలో ఛేదించింది: 13.4 ఓవర్లు 

ప్రత్యర్థి: పాపువా న్యూగిని (2021) 

విజేత: పాకిస్థాన్‌

టార్గెట్: 152 

ఎన్ని ఓవర్లలో ఛేదించింది: 17.5 ఓవర్లు 

ప్రత్యర్థి: భారత్ (2021) 

విజేత: ఇంగ్లాండ్ 

టార్గెట్: 169 

ఎన్ని ఓవర్లలో ఛేదించింది: 16 ఓవర్లు 

ప్రత్యర్థి: భారత్ (2022 T20WC, సెమీ ఫైనల్ 2) 

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home