2023.. టీమ్‌ఇండియా టాపర్లు

మహ్మద్‌ షమి

భారత సీనియర్ పేసర్ షమి 2023 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన (7/57). ఈ ఏడాది ఓవరాల్‌గా 19 వన్డేల్లో 43 వికెట్లు, నాలుగు టెస్టుల్లో 13 వికెట్లు తీశాడు.

మహ్మద్‌ సిరాజ్‌

భారత్ ఆసియా కప్‌ సాధించడంలో సిరాజ్‌ది కీలకపాత్ర. శ్రీలంకతో ఫైనల్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (6/21) నమోదు చేశాడు. 2023లో ఇప్పటివరకు 6 టెస్టుల్లో 13 వికెట్లు, 25 వన్డేల్లో 44 వికెట్లు, రెండు టీ20ల్లో ఒక వికెట్ పడగొట్టాడు.

కుల్‌దీప్ యాదవ్ 

కుల్‌దీప్‌ యాదవ్ 30 మ్యాచ్‌లు ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది వన్డేల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వికెట్లు పడగొట్టింది కుల్‌దీపే. వన్డే ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసిన కుల్‌దీప్‌.. 9 టీ20లు ఆడి 14 వికెట్లు తీశాడు.

జస్‌ప్రీత్‌ బుమ్రా 

స్టార్‌ పేసర్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ ముందు ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 17 వన్డేలు ఆడి 28 వికెట్లు పడగొట్టగా.. అందులో 20 ప్రపంచ కప్‌లో తీసినవే. రెండు టీ20ల్లో 4 వికెట్లు తీశాడు.

శుభ్‌మన్ గిల్ 

యువ ఓపెనర్ గిల్ 29 వన్డేలు ఆడి 1584 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడు కూడా. 5 టెస్టులు ఆడి 230 చేసిన గిల్‌, 13 టీ20ల్లో 312 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ 

స్టార్‌ బ్యాటర్ కోహ్లీ 27 వన్డేల్లో 1,377 పరుగులు చేశాడు. వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. 7 టెస్టులు ఆడి 557 పరుగులు చేశాడు. 

రోహిత్ శర్మ 

కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది 7 టెస్టులాడి 540 చేయగా... 27 వన్డేల్లో 1,255 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుపు ఆరంభాలిచ్చి 597 పరుగులు చేశాడు. 

రింకు సింగ్ 

ఐపీఎల్‌లో ఫినిషర్‌గా అదరగొట్టిన రింకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక్కడా అదే ఊపులో ఆడుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌తో టీ20ల్లోకి అడుగుపెట్టిన రింకు.. మొత్తంగా 12 టీ20ల్లో 262 పరుగులు చేశాడు. రెండు వన్డేలు ఆడి 55 పరుగులు చేశాడు.

యశస్వి జైస్వాల్  

ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన యువ బ్యాటర్ యశస్వి ఆడిన 2 టెస్టుల్లోనూ అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో (వెస్టిండీస్‌పై) 171 పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో 57, 38 స్కోర్లు సాధించాడు. 15 టీ20ల్లో 430 రన్స్‌ చేశాడు.

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

Eenadu.net Home