3డీ ఫ్లవర్సా మజాకానా..
ఇంతకుముందు 3డీ అనే మాటను సినిమాల విషయంలోనో ఏ బ్యానర్‌కి ఎఫెక్ట్ ఇవ్వడంలోనో వినుంటారు కదా.. ప్రస్తుతం ఈ 3డీ ఎఫెక్ట్‌ను చీరలకు బ్లౌజులకు కూడా జోడిస్తున్నారు డిజైనర్లు.
ప్రస్తుతం మహిళా మణులు కడుతున్న చీర ఖరీదు అటు ఇటు అయినా పట్టించుకోట్లేదు కానీ బ్లౌజు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు.
మొన్నీ మధ్య వరకూ మగ్గం వర్కు బ్లౌజులు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడీ త్రీడి ఫ్లవర్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
సున్నితంగా ఉండే నెట్, జార్జెట్, నైలాన్ ఫ్యాబ్రిక్కులతో తామర, లిల్లీ, గులాబి వంటి పువ్వులు వివిధ రకాల ఆకృతుల్లో ఆకులను తయారు చేస్తున్నారు.
ఈ పూలను చీరకు మ్యాచింగ్ అయ్యేలా చూసుకొని దానికి అనుగుణంగా పూసలు, చమ్కీలు జోడించి తీర్చిదిద్దుతున్నారు.
3డీ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నారంటే.. అవి అంత తాజాగా ఉంటాయి మరి! సహజమైన పూలను తెచ్చి బ్లౌజుపై పెట్టారా అన్నంతగా ఆకట్టుకుంటాయి.
పెళ్లి కూతుళ్లకి కొత్తందం తెచ్చిపెట్టే ఈ త్రీడీ పూలందాల బ్లౌజులవైపే మహిళలు మొగ్గు చూపిస్తున్నారు.
ఈ కామర్స్ వెబ్‌సైట్లలోనూ 3డీ ఫ్లవర్ డిజైనర్ బ్లౌజుల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయి.