పిల్లల పెంపకం ఓ కళ

ఆ ప్రభావం పడనీయకండి

 

మనం నిత్యం వృత్తి జీవితంతోపాటు ఇతర అనేక పనుల్లో మునిగితేలుతూ ఒత్తిడికి గురవుతుంటాం. దీంతో అప్పుడప్పుడు చిరాకు కలగటం సహజం. ఆ ప్రభావం పిల్లలపై పడేలా చేయకండి. వారితో ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి.

Image:Pixabay

నిబద్ధతతో ఉండండి


పిల్లలను పెంచే విషయంలో నిబద్ధత పాటించండి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కోండి. మీ నిబద్ధతే వారికి అలవాటవుతుందన్న విషయం గుర్తుంచుకోండి.

Image:Pixabay

సమస్యను గుర్తించండి


మీ పిల్లలను అర్థం చేసుకోవడంలో మీరు ఎక్కడ తడబడుతున్నారో తెలుసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పనులు ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. మీరు వారి నుంచి ఏం కోరుకుంటున్నారో అది వారి స్థాయికి తగినట్టుగా ఉండేలా చూసుకోవాలి.

Image:Pixabay

అరవడం ఆపేయండి


పిల్లలకు కొన్నిసార్లు చిన్న చిన్న పనులు చేయమని చెప్తుంటాం. వారు ఆ పనులు చేయకపోతే తిట్టడం, కొట్టడం, అరవడం చేస్తే పిల్లలు ఇంకా మొండిగా తయారవుతారు. ఆప్యాయంగా దగ్గరకి పిలుచుకుని చెప్తే పిల్లలు మాట వింటారు.

Image:Pixabay

అవి ప్రస్తావించొద్దు


మీ పిల్లల ముందు ఎప్పుడూ మంచి విషయాలను మాట్లాడండి. వారిలో ఉన్న చెడు లక్షణాల గురించి పదే పదే ప్రస్తావించకుండా వారిలో ఉన్న మంచి లక్షణాల గురించి తెలియజేయండి. దాంతో వాళ్ల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది.

Image:Pixabay

వాళ్ల ఎంపికకే ఓటేయండి


ఏ విషయంలోనైనా వాళ్ల ఎంపికకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. వారికి నచ్చిన పనిని వాళ్లని చేయనివ్వండి. మీ అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకండి. వారికి నచ్చిన దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించండి.

Image:Pixabay

ఇతరులతో పోల్చకండి


మీ పిల్లల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలను తెలుసుకోండి. వాటిని మెరుగుపరచడానికి కావలసిన తోడ్పాటు అందించండి. ఇతరులతో పోల్చకండి. మీ పిల్లలు అందరికంటే ప్రత్యేకమైన వారని గుర్తించండి.

Image:Pixabay

ఆనందంగా గడపండి


మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. వారితో ఆనందంగా గడపండి. వారి కంటే మీకు ఏదీ ఎక్కువ కాదని తెలిసేలా చేయండి. వారు అడిగిన ప్రతి దాన్ని కొనిపెట్టకుండా వారికి ఏది అవసరమో అది కొనివ్వండి.

Image:Pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home