బ్రెజిల్‌లో గాల్లోనే తినేయొచ్చు!

ఎగసిపడే జలపాతాలు చూడ్డానికి ఎంత బాగుంటాయో. అదే వాటికి దగ్గరగా వెళితే ఒళ్లు ఝల్లుమంటుంది. 

image: google

అలాంటిది 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతానికి ఆనుకున్నట్లుగా గాల్లో వేలాడుతూ ఉండే టేబుల్‌ ముందు కూర్చుని విందు ఆరగిస్తుంటే.. గుండెలు జారిపోతాయి కదూ.

image: google

సాహస ప్రియులు మాత్రం ఇలాంటివి బాగానే ఎంజాయ్‌ చేస్తారు. థ్రిల్‌ ఫీలవుతారు. 

అలాంటి అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటే బ్రెజిల్‌ విమానం ఎక్కాల్సిందే. అక్కడి సెపుల్తారా జలపాతం దగ్గరకు వెళితే కచ్చితంగా ఆ సరదా తీరుతుంది. 

image: google

రియో గ్రాండ్‌ దోసుల్‌లో సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం సాహసప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

image: google 

ఆ అందాలను చూడటానికి దేశవిదేశాల పర్యాటకులు వెళుతుంటారు. అక్కడ జలపాతాన్ని చూడటంతోపాటు... దానిపైన గాల్లో విందు ఆరగించడానికి కేబుల్‌ సాయంతో టేబుళ్లను కూడా ఏర్పాటు చేశారు. 

image: google

దాదాపు పావుగంట పాటు ఈ థ్రిల్‌ని ఎంజాయ్‌ చేయొచ్చు. 

టికెట్‌ తీసుకుని సాహసానికి సిద్ధమైతే చాలు... ఇష్టమైన వంటకాలతో కేబుల్‌ టేబుల్‌ రెడీ!

image: google

వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడే అంశాలివే..!

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

Eenadu.net Home