ప్రేమలో పడ్డ ఆమిర్ తనయ..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ మరోసారి ప్రేమలో పడింది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో లవ్‌లో ఉన్నట్లు ఐరా వెల్లడించింది.
Image:Instagram
వీరిద్దరి మధ్య ప్రేమయాణం సాగుతోందని గతంలోనే చాలా వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది ఆమీర్‌ఖాన్ తనయ.
Image:Instagram
ఐరా ఖాన్ ఇంతకుముందు మిషాల్ అనే కుర్రాడితో కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిపింది. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు.
Image:Instagram
నుపుర్ గత కొన్నేళ్ల నుంచి ఆమిర్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఐరా సైతం నుపుర్ వద్ద ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంటోంది.
Image:Instagram
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. Image:Instagram
ఈ భామ యూరిపైడ్స్ మెడియా అనే థియేట్రికల్ డ్రామాకు దర్శకత్వం వహించింది.
Image:Instagram
ఐరా ఖాన్ 1997 ఆగస్టు 17న ముంబయిలో జన్మించింది. ఈమె ఆమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె.
Image:Instagram
ఐరా కొన్నాళ్లు మానసిక కుంగుబాటుకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
Image:Instagram
ఈ బ్యూటీ పలు స్వచ్ఛంద సంస్థలకు వివిధ రూపాల్లో సహాయం చేస్తుంది. ముంబయిలో కొలబా ఫుట్‌బాల్ మ్యాచ్‌ని నిర్వహించి వచ్చిన సొమ్ముని వీధి కుక్కలను రక్షించే ఎన్‌జీవోకి అందించింది.
Image:Instagram
ఖాళీ సమయం దొరికితే సంగీతం వినడం, షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుందట. జాన్వీ కపూర్, ఫాతిమా సనాతో ఆమెకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది.
Image:Instagram
‘14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా. నాకు జరిగిన సంఘటన ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి ఆ బాధ నుంచి బయటికి వచ్చేశా’ అని ఓ సందర్భంలో తెలిపింది.
Image:Instagram
ఐరా ఖాన్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 6 లక్షల 29 వేలమందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
image:Instagram