ఆరుషి.. అందం చూస్తే దిల్ ఖుషి

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకిని డాకిని’లో మరో భామ కూడా నటించింది. తనే ఆరుషి వర్మ.

Image:Instagram

ఈ నెల 16న విడుదలైన ఈ చిత్రంతోనే ఆరుషి.. తెరంగేట్రం చేసింది.

Image:Instagram

దిల్లీలోని శ్రీ రామ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆరుషి.. 1998 నవంబర్‌ 13న జన్మించింది.

Image:Instagram

డిగ్రీ రెండో ఏడాదిలో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. చిన్నప్పుడే నటి కావాలని ఫిక్స్‌ అయ్యిందట.

Image:Instagram

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు ‘శాకిని డాకిని’కి ఎంపికైంది. ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే హాట్‌స్టార్‌ రూపొందిస్తున్న ఓ మూవీలో ఛాన్స్‌ కొట్టేసింది.

Image:Instagram

కెరీర్‌ ఆరంభంలో ఆరుషి చాలా తిరస్కరణలకు గురైంది. ఎంపిక చేసిన పాత్రల కంటే ఆమె చాలా చిన్నదిగా కనిపిస్తుందని చెప్పి రిజెక్ట్‌ చేశారట.

Image:Instagram

 టాలీవుడ్‌తో తన సినీ ప్రయాణం ప్రారంభం కావడంపై ఆరుషి సంతోషం వ్యక్తం చేసింది. ఇక్కడి వారితో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Image:Instagram

ఆరుషికి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే గోవా, మనాలీ, లడఖ్‌, సిమ్లాకు వెళుతుందట.

Image:Instagram

ఈ బ్యూటీ మంచి ఫుడ్డీ, డ్యాన్సర్‌. చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌ని ఎక్కువగా లాగించేస్తుంది.

Image:Instagram

హీరోల్లో సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్.. హీరోయిన్లలో కత్రినా కైఫ్‌, దీపికా పదుకొణె నటనంటే ఇష్టమట.

Image:Instagram

ఆరుషి సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.

Image:Instagram

టాప్‌ టెన్‌ హారర్‌ మూవీలు

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

Eenadu.net Home