పొలిటీషియన్‌ కమ్‌ హీరోయిన్ మిమి చక్రవర్తి!

హీరోయిన్‌గా చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారీ బెంగాలీ నటి మిమి చక్రవర్తి.

Source: instagram

పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో 1989లో ఈమె జన్మించారు.

Source: instagram

నటిగా, సింగర్‌గా, మోడల్‌గా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Source: instagram

ఇటీవల బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన న్యూడ్‌ ఫొటో షూట్‌పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Source: instagram

ఇదే విధంగా ‘ఓ మహిళ నగ్న ఫొటో షూట్ చేస్తే ఇలాంటి స్పందన లభిస్తుందా? రణ్‌వీర్‌కు వచ్చిన ప్రశంసలు మహిళకు దక్కుతాయా?’ అని ట్వీట్ చేశారు.

Source: instagram

ఈ ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో ఆమెను చాలా మంది సపోర్ట్‌ చేశారు.

Source: instagram

మిమి చక్రవర్తి 2012లో ‘బాపి బారి జా’అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. 20కి పైగా చిత్రాల్లో మెరిశారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.

Source: instagram

2019లో ఆ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గ ఎంపీగా ఎన్నికయ్యారు.

Source: instagram

గతేడాది జూన్‌లో ఓ వ్యక్తి (నకిలీ ఐఏఎస్‌) నటిని బురిడీ కొట్టించాడు. కరోనా టీకా కార్యక్రమానికి ఆహ్వానించాడు.

Source: instagram

టీకా తీసుకున్నా ఫోన్‌కు సందేశం రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను నకిలీ ఐఏఎస్‌ అని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Source: instagram

తన ఫోన్‌లో దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు గతేడాది నవంబర్‌లో ఫోన్ నుంచి డిలీట్‌ అయిన విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది.

Source: instagram

వాటిని తిరిగి పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఆ సమయంలో తనకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోందని చెప్పింది.

Source: instagram

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిమి చక్రవర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Source: instagram

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home