చూడచక్కని ‘బుట్టబొమ్మ’.. హీరోయిన్‌గా వస్తోందమ్మా..!

‘విశ్వాసం’లో అజిత్‌కు కుమార్తెగా నటించి తెలుగు వారికి దగ్గరైన బాలనటి అనిక సురేంద్రన్‌.. ఇప్పుడు ప్రేమకు కొత్త నిర్వచనం చెబుతూ హీరోయిన్‌గా కనిపించబోతోంది.

image:instagram/anikhasurendran

శౌరి చంద్రశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’లో సూర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌లతో కలిసి నటించింది.

image:instagram/anikhasurendran

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అందంగా కనిపించింది.

image:instagram/anikhasurendran

అనిక కేరళలోని మంజేరిలో 2004 నవంబరు 28న పుట్టింది. ‘కధా తుదరున్ను’తో బాలనటిగా తెరంగేట్రం చేసింది.

image:instagram/anikhasurendran

బాలనటిగా అనిక .. మలయాళం, తమిళ్‌లో 15కి పైగా సినిమాల్లో నటించింది. 

image:instagram/anikhasurendran

ఈ చిన్నది.. బిగ్‌బీ అమితాబచ్చన్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. 

image:instagram/anikhasurendran

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవితోనూ ఓ ప్రకటనలో నటించింది. ఇవే కాకుండా అనేక ప్రకటనల్లో నటించిందీ అనిక . 

image:instagram/anikhasurendran

‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’లో అజిత్‌కి, మలయాళ చిత్రం ‘గ్రేట్‌ ఫాదర్‌’లో మమ్ముట్టికి కుమార్తెగా నటించి బాగా పాపులరైంది.

image:instagram/anikhasurendran

ఈమె‘సుందరైకల్‌’, ‘కధా తుదరున్ను’, ‘గ్రేట్‌ ఫాదర్‌’ ‘విశ్వాసం’ సినిమాలకు ఉత్తమ బాలనటిగా అవార్డులూ అందుకుంది.

image:instagram/anikhasurendran

ఇటీవల నాగార్జున ‘ఘోస్ట్‌’లో కీలక పాత్రలో నటించింది అనిక. ఇదే ఆమె తొలి తెలుగు చిత్రం. ఇప్పుడు ‘బుట్టబొమ్మ’తో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. 

image:instagram/anikhasurendran

This browser does not support the video element.

అనిక సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌. తరచూ వీడియోలు రూపొందిస్తూ పోస్టు చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు 1.7 మిలియన్‌, ఫేస్‌బుక్‌లో 3.2 మిలియన్‌ ఫాలోవర్లున్నారు.

image:instagram/anikhasurendran

బాలనటిగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఈ బుట్టబొమ్మ.. హీరోయిన్‌గా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

image:instagram/anikhasurendran

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home